Brahmamudi April 23rd Episode: ఇంటి అడ్రస్ చెప్పిన కళావతి.. కంపెనీ బాధ్యతలు తీసుకున్న రాజ్ - బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 23 ఎపిసోడ్ హైలెట్స్!
మేనేజర్ నుంచి సమాచారం తెలుసుకున్న రాహుల్ వెళ్లి రుద్రాణికి చెబుతాడు. రాజ్ లేకపోతే డీల్ ఫినిష్ అవ్వదనే విషయం మెటీరియల్ సప్లై చేసేవారికి అర్థమయ్యేలా చెప్పాలంటూ రుద్రాణి వెంటనే కాల్ చేసి మీ డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలో చెబుతానంటూ ఓ పెద్ద ప్లాన్ వేస్తుంది
నవ్య జ్యూయెలర్స్ మేనేజర్‌కి కాల్ చేసి రుద్రాణి మీకు రావాల్సిన పేమెంట్స్ ఇవ్వడానికి పవర్ ఆఫ్ పట్టా కావ్య పేరుమీద లేదు.. రాజ్ చనిపోయాడు కదా..మీకు హెల్ప్ చేసేందుకే కాల్ చేశాను అంటుంది.. వాళ్లు వెంటనే రంగంలోకి దిగుతాం అంటారు
ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది...డీల్ ఫినిష్ అవ్వాలంటే రాజ్ రావాలి ఒకవేళ తీసుకురాలేకపోతే వాడు చచ్చాడని డెత్ సర్టిఫికెట్ అయినా తీసుకురావాలని అంటుంది రుద్రాణి.
రాజ్, కావ్యలు ఫోన్లో మాట్లాడుకుంటారు... నేను పోలీస్ అని బిస్కెట్ వేస్తే మీరు అసలు విషయం చెప్పి పెద్ద క్రీమ్ బిస్కెట్ వేశారంటాడు రాజ్. కావ్య నవ్వుతూనే ఉంటుంది. మీరు హాయిగా నవ్వుతుంటే బావుంది అంటాడు.
మీ అడ్రస్ ఇవ్వండి అని రాజ్ అంటే..ఎందుకు అని అడుగుతుంది. మీరు నాకు టిఫిన్, భోజనం, బట్టలు పంపించారు...నేను మీకు కనీసం కశ్చీప్ కూడా పంపించలేదు అంటాడు. అడ్రస్ ఇవ్వండి ప్లీజ్ అంటాడు. ఓ పొడుపుకథలా చెబుతాను మీరు అర్థం చేసుకోండి అంటుంది
రుద్రాణి ప్రయోగించిన జ్యూయెలర్స్ మేనేజర్ కావ్యకి కాల్ చేసి పవర్ ఆఫ్ అటార్నీ గురించి అడుగుతాడు. రాజ్ సార్ డెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసి పవర్ ఆఫ్ అటార్ని మీ పేరుమీద తీసుకుంటే కానీ బ్యాలెన్స్ అమౌంట్ క్లియర్ చేయడం కుదరదు అంటారు. ఆ మాటలకు కావ్య షాక్ అవుతుంది
అప్పటి వరకు ఫండ్స్ లేకపోతే మా ప్రోడక్షన్ కి సమస్య అవుతుందని అంటుంది కావ్య. ఇంతలో అపర్ణ వచ్చి టిఫిన్ చేయమంటే అర్జెంటుగా వెళ్లాలి అంటుంది. రుద్రాణి సెటైర్స్ వేస్తుంటుంది. ఇంతలో క్లైంట్స్ ఇంటికి వస్తారు. రాజ్ సర్ ఉన్నప్పుడు మా బిల్స్ అన్నీ టైమ్ కి క్లియర్ చేసేవారు అంటారు
మా పేమెంట్స్ విషయంలో ఎలాంటి మార్పులు రావని చెబుతాడు సుభాష్. ఇంట్లో వాళ్లంతా కూడా సుభాష్ కి సపోర్ట్ చేస్తారు. రాజ్ లేకపోతే పవర్ ఆఫ్ అటార్నీ కావ్యకి రావాలి అది రావాలంటే రాజ్ చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అంటుంది.
రాజ్ డెత్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ తీసుకొచ్చానని దీనిపై సంతకాలు చేస్తే నేను వెళ్లి డెత్ సర్టిఫికేట్ తీసుకొస్తా అంటుంది రుద్రాణి. ఆ మాటలకు అపర్ణ, కావ్య ఊగిపోతారు. ఎన్నిసార్లు చెప్పినా అర్థంకాదా అంటారు. అయితే మీ కొడుకుని వెంటనే రమ్మని చెప్పండి అంటుంది రుద్రాణి
రుద్రాణికి మద్దతుగా ధాన్యలక్ష్మి తయారవుతుంది. ఒక్కరోజు టైమ్ ఇవ్వండి మీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ క్లియర్ చేస్తానని హామీ ఇస్తుంది కావ్య. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావని అడుగుతుంది రుద్రాణి
బ్రహ్మముడి ఏప్రిల్ 24 ఎపిసోడ్ లో... రాజ్ తో కంపెనీ ఫైల్స్ , చెక్ పై సంతకం పెట్టి తీసుకొస్తుంది కావ్య. అవి ఫోర్జరీనా నిజమా చెక్ చేయమంటుంది రుద్రాణి..