Sonali Bendre: స్టైలిష్ లుక్ లో సోనాలి బింద్రే
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ అందాల భామ.
ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది.
తెలుగులో సోనాలి బింద్రే నటించిన ఇంద్ర, మురారి, మన్మథుడు, ఖడ్గం, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలు బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి.
మెల్లిమెల్లిగా టాలీవుడ్ కు, ఆ తరువాత బాలీవుడ్ కు దూరమై ఫ్యామిలీకే పరిమితం అయ్యింది.
సినిమాలకు దూరం అయిన కొద్ది రోజుల తర్వాత తనకు కాన్సర్ అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
చివరకు ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించి తన మనో ధైర్యాన్ని నిరూపించుకుంది.
ఆ తర్వాత బుల్లి తెరపై జడ్జిగా చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నది.
మంచి కథలు దొరికితే సినిమాలు చేయాలనుకుంటున్నట్లు ఈ ముద్దుగుమ్మ వెల్లడించింది.
ఈమెను తెలుగులో రీ ఎంట్రీ చేయించాలని పలువురు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
అన్నీ అనుకున్నట్లు జరిగితే మళ్లీ తెలుగు తెరపై సోనాలి కనిపించే అవకాశం ఉంది.