‘కామన్ మ్యాన్ ప్రపంచంకో అచ్చ కర్నేకే లియే’.. ఇద్దరు భామ్మలతో ‘ది లెజండ్’ శరవణన్ ‘పాన్’ స్పీచ్!
ప్రముఖ వాణిజ్యవేత్త, శరవణ స్టోర్స్ అధినేత అరుల్ శరవణన్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ది లెంజెడ్’ జూలై 28న విడుదల కానుంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. దీంతో అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శరవణన్ హైదరాబాద్‌కు విచ్చేశారు. ఆయనతోపాటు ఊర్వశీ రౌతేలా, రాయ్ లక్ష్మీతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వమించారు. ఇందులో శరవణన్ ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘అందరికీ నమస్కారం’’ అంటూ తెలుగులో పలకరించిన ఆయన.. ఆ తర్వాత ఏ భాషలో మాట్లాడాలో అర్థం కాలేదు. దీంతో హిందీ, తమిళ, తెలుగు, ఇంగ్లీష్‌ను మిక్సీలో వేసి తిప్పినట్లుగా.. ‘పాన్’ ఇండియా స్పీచ్ ఇచ్చారు. దీంతో కాసేపు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు. ఒక సామాన్యుడు ప్రపంచానికి మంచి చేయడం కోసం.. అని చెప్పడానికి ‘‘కామన్ మయాన్ ప్రపంచంకో అచ్చ కర్నేకే లియే..’’ అంటూ తనకు తోచిన భాషల్లో మాట్లాడేశారు. దీంతో యాంకర్ కలుగజేసుకుని.. మీరు తమిళంలో మాట్లాడండి అర్థం చేసుకుంటామని చెప్పారు. దీంతో ఆయన తమిళంలో స్పీచ్ ముగించారు. ఆ కార్యక్రమం ఫొటోలను ఇక్కడ చూడండి.
రాయ్ లక్ష్మీ(లక్షీ రాయ్)
శరవణన్
లక్షీ రాయ్
ఊర్వశీ రౌతేలాతో శరవణన్
లక్షీ రాయ్, ఊర్వశీలతో శరవణన్
శరవణన్
లక్షీ రాయ్, ఊర్వశీలతో శరవణన్
ఊర్వశీ రౌతేలా
ఊర్వశీ
లక్షీ రాయ్, ఊర్వశీ