Thandel Shooting: ‘తండేల్’ తొలి షెడ్యూల్ కంప్లీట్, షూటింగ్ స్టిల్స్ చూశారా?
‘తండేల్’ మూవీ తాజా షెడ్యూల్ షూటింగ్ లో హీరో, హీరోయిన్లు నాగ చైతన్య, సాయి పల్లవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలోని కీలకమైన సన్నివేశాలని చిత్రీకరించారు. ఈ మేరకు వర్కింగ్ స్టిల్స్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీని రియలిస్టిక్ గా తీస్తున్నారు. వర్కింగ్ స్టిల్స్ చూస్తే అది అర్ధమౌతోంది. నాగ చైతన్య, సాయి పల్లవి చాలా సహజసిద్ధంగా, తక్కువ మేకప్ తో కనిపిస్తున్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం సహజసిద్ధమైన లోకేషన్స్ లో చిత్రాన్ని షూట్ చేస్తున్నారు.Photo Credit: Geetha Arts/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘తండేల్’ మూవీ శ్రీకాకుళంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. పాక్ నేవీ చేతిలో పట్టుబడిన మత్స్యకారుడిగా నాగ చైతన్య నటిస్తున్నాడు. రెండు నెలల క్రితమే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లగా, ఇప్పుడు ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది.Photo Credit: Geetha Arts/Instagram
తాజా షెడ్యూల్ లో శ్రీకాకుళం ఓడరేవు, పరిసర గ్రామాల్లో చిత్రీకరించినట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అటు ఉడిపి, మంగళూరులో చిత్రీకరించారు. ఈ కీలక షెడ్యూల్‌లో పలు ముఖ్యమైన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. Photo Credit: Geetha Arts/Instagram
ఈ చిత్రంలో సాయి పల్లవి, నాగ చైతన్య మధ్యన ప్రేమను నేచురల్ గా చూపించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. తాజా షెడ్యూల్ షూటింగ్ ఫోటోలను పరిశీలిస్తే, సాయి పల్లవి, నాగ చైతన్య నేచురల్ లుక్ లో కనిపించారు. ఈ చిత్రంలో నాగ చైతన్య కోసం ఎదురు చూసే అమ్మాయిలా చక్కటి నటించినట్లు తెలుస్తోంది. Photo Credit: Geetha Arts/Instagram
బతుకుతెరువు కోసం గుజరాత్ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కనుంది. ఇందులో నాగ చైతన్య గుజరాత్ సముద్రతీర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి పాత్రలో కనిపించనున్నారు.Photo Credit: Geetha Arts/Instagram
ఇక తాజాగా ‘తండేల్’ అంటే అర్థం ఏంటో స్వయంగా చిత్ర దర్శకుడు చందూ మొండేటి వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన టైటిల్ మీనింగ్ చెప్పారు. గుజరాతీ భాషలో ‘తండేల్’ అంటే బోటు నడిపే ఆపరేట్ అని అర్థం అన్నారు. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఉపయోగిస్తారని చెప్పారు. Photo Credit: Geetha Arts/Instagram
నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా ‘తండేల్’ తెరకెక్కుతోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ‘తండేల్’ కోసం మరోసారి జోడీ కడుతోంది.Photo Credit: Geetha Arts/Instagram
అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది. ఇప్పుడు మళ్లీ ‘తండేల్’ మూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన వీడియో గ్లింప్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది.Photo Credit: Geetha Arts/Instagram
అక్కినేని నాగ చైతన్య చివరిగా కనిపించిన ‘కస్టడీ’ మూవీ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైనా, ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ప్రస్తుతం నాగ చైతన్య తన ఆశలన్నీ తర్వాతి సినిమా ‘తండేల్’ మీదే పెట్టుకున్నారు. Photo Credit: Geetha Arts/Instagram