Sreemukhi Photos : అందమైన కుందనాల బొమ్మలా మారిన శ్రీముఖి.. లేటెస్ట్ ఫోటోలు చూశారా
యాంకర్ శ్రీముఖి పింక్ కలర్ ఔట్ఫిట్లో చాలా అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. స్టార్ మాలో ప్రసారమయ్యే సూపర్ సింగర్ కోసం శ్రీముఖి ఇలా ముస్తాబైంది.(Images Source : Instagram/sreemukhi)
చెవులకు పెద్ద పెద్ద జుంకాలు పెట్టుకుని, చేతులకు గాజులు వేసుకుని, తల్లో మల్లె పూలు పెట్టుకుని.. అందమైన కుందనపు బొమ్మలా.. అచ్చమైన తెలుగమ్మాయిలా రెడీ అయింది.(Images Source : Instagram/sreemukhi)
ఈ లుక్‌లో ఓ చిన్న ఫోటోషూట్ చేసింది శ్రీముఖి. వాటికి సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇన్‌స్టాలో ఆమె షేర్ చేసిన ఫోటోలకు అభిమానులు చాలా బాగున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Images Source : Instagram/sreemukhi)
తెలుగు యాంకర్‌గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది శ్రీముఖి. నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచమైనా.. యాంకర్‌గానే ఈ భామ ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది.(Images Source : Instagram/sreemukhi)
జులాయి సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించి.. నేను శైలజలో నటించి తాజాగా భోళా శంకర్‌లో నటించి మెప్పించింది. నటిగా కూడా తన పాత్రలకు న్యాయం చేస్తుంది శ్రీముఖి.(Images Source : Instagram/sreemukhi)
యాంకర్‌గా పటాస్‌తో సూపర్ ఫేమ్ అందుకున్న శ్రీముఖి బిగ్‌బాస్ అనే రియాలటీ షోకి కూడా వెళ్లింది. చివరకు గేమ్‌లో నిలిచి.. రన్నరప్‌గా బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చింది. ఈ షో తర్వాత కెరీర్ మీద మరింత ఎక్కువ ఫోకస్ చేసింది.(Images Source : Instagram/sreemukhi)
టీవీల్లోని కార్యక్రమాలతో పాటు పలు ఈవెంట్లతో బిజీగా మారింది. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టి తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది.(Images Source : Instagram/sreemukhi)
పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా వెకేషన్‌కి వెళ్లాల్సి వస్తే అక్కడి దృశ్యాలను వ్లాగ్స్ రూపంలో తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటుంది.(Images Source : Instagram/sreemukhi)