Tamannaah Bhatia: పెళ్లి విషయంలో బాంబ్ పేల్చిన మిల్కీ బ్యూటీ తమన్నా!
టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ బ్యూటీస్ లిస్టులో తమన్నా కూడా ఉంటుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ అదే గ్లామర్, అదే ఫాలోయింగ్ మెంటైన్ చేస్తోంది తమన్నా...
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తమన్నా ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది. లేటెస్ట్ గా ఫుల్ బ్లాక్ లో ఇలా ఫోజులిచ్చింది...
టాలీవుడ్, కోలీవుడ్ తో పాటూ బాలీవుడ్ లోనూ వెలుగుతున్న తమన్నా..కొంతకాలంగా విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. తనతో కలసి చాలా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసింది..ఫ్యాషన్ షో లలో ర్యాంప్ వాక్ చేసింది.. రొమాంటిక్ పిక్స్ షేర్ చేసిందకి..
త్వరలోనే ఇద్దరి పెళ్లి అని ఫిక్సైపోయారంతా...కానీ ఇప్పట్లో పెళ్లి అనే మాటే లేదని బాంబ్ పేల్చింది తమన్నా. అసలు ప్రస్తుతానికి ఆ ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చేసింది..
పెళ్లి చేసుకుంటే కెరీర్ ఉండదనే భయం అప్పట్లో ఉండేది కానీ ఇప్పుడా ప్రశ్నే లేదు.. పెళ్లైనా కానీ ఇండస్ట్రీలో వెలుగుతున్న ముద్దుగుమ్మలెందరో ఉన్నారు..ఇప్పుడసలు పెళ్లైన హీరోయిన్ అంటే పెద్ద సమస్యే కాదు.. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పుటినుంచో ఉన్నా సౌత్ లోనూ ఇప్పుడిదే కొనసాగుతోంది..
త్వరలో పెళ్లిచేసుకుని ఓ ఇంటిది అయిపోతుందనుకున్న తమన్నా..పెళ్లి కబురు చెబుతుంది అనుకుంటే ఇలా చెప్పిందేంటా అనుకుంటున్నారు ఫ్యాన్స్...