Taapsee: తాప్సి స్టైల్... ఒక్క రోజులో మూడు వేరియేషన్స్!
కథల ఎంపికలో తాప్సి పన్ను వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు. అంతే కాదు... కథల్లోనే కాదు... డ్రస్సింగ్ స్టైల్స్ విషయంలో కూడా అని చెప్పాలి. ఒక్క రోజులో ఆమె మోడీ వేరియేషన్స్ చూపించారు. తాప్సి నటించిన 'లూప్ లపేటా' సినిమా ఫిబ్రవరి 4న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కానుంది. రీసెంట్‌గా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో తాప్సి ఈ విధంగా సందడి చేశారు. క్యాజువల్‌గా ట్రాక్‌లో కనిపించారు. ట్రెండీగా మినీ స్కర్ట్ - షర్ట్ వేసుకుని దానిపై కోట్ వేశారు. వైట్ షర్ట్ - గౌనులోనూ కనిపించారు. (Image courtesy - @Taapsee Pannu/Instagram)
జర్మన్ హిట్ 'రన్ లోలా రన్' సినిమాకు 'లూప్ లపేటా' రీమేక్. ఇందులో బాయ్‌ఫ్రెండ్‌ను కాపాడటానికి ప్రయత్నించే అమ్మాయిగా తాప్సి కనిపించనున్నారు. (Image courtesy - @Taapsee Pannu/Instagram)
తాప్సికి 'లూప్ లపేటా' ఈ ఏడాది తొలి రిలీజ్. (Image courtesy - @Taapsee Pannu/Instagram)
ఈ ఏడాది తాప్సి నిర్మాతగా కూడా పరిచయం కానున్నారు. ఆల్రెడీ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన ఆమె... 'బ్లర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. (Image courtesy - @Taapsee Pannu/Instagram)
ప్రస్తుతం తెలుగులో 'మిషన్ ఇంపాజిబుల్' సినిమా చేస్తున్నారు. (Image courtesy - @Taapsee Pannu/Instagram)
తాప్సి (Image courtesy - @Taapsee Pannu/Instagram)
తాప్సి (Image courtesy - @Taapsee Pannu/Instagram)