Sudheer Babu: పాన్ ఇండియా మూవీలో ఆఫర్ వద్దనుకున్న సుధీర్ బాబు…
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బాబు బావగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తన ప్రతిభతోనే సుధీర్ బాబు హీరోగా నిలదొక్కుకున్నాడు. ఎస్ఎంఎస్, ప్రేమ కథా చిత్రం, సమ్మోహనం లాంటి హిట్స్ సుధీర్ బాబు కెరీర్ లో ఉన్నాయి.
కెరీర్ ఆరంభంలో అందరిలాగే తాను కూడా ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నా అన్న సుధీర్ బాబు కొన్ని విషయాలను ఈ మధ్యే రివీల్ చేశాడు. సుధీర్ బాబు లుక్ బాగాలేదని, హీరోగా పనికిరాడని ఓ కెమెరామెన్ అన్నాడట. దీనితో సుధీర్ బాబు ఆ చిత్రంలో అవకాశం కోల్పోవలసి వచ్చింది. రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత మళ్లీ మొదట్లో రిజెక్ట్ చేసినవారే పిలిచి ఆఫర్ ఇచ్చారని చెప్పాడు.
బాలీవుడ్ లో కూడా సత్తా చాటిన సుధీర్ బాబు.. ' భాగీ ' లో విలన్ గా నటించాడు. తాజాగా సుధీర్ బాబు ఓ క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో ఆఫర్ రిజెక్ట్ చేశానని చెప్పి షాకిచ్చాడు. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న బ్రహ్మాస్త్ర భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మూవీలో విలన్ పాత్రలో నటించే అవకాశం మొదట సుధీర్ బాబుకి వచ్చింది. కానీ ఆ ఆఫర్ రిజెక్ట్ చేశాడట.
ఈ మధ్యే 'శ్రీదేవి సోడా సెంటర్' లో నటించిన సుధీర్ బాబు.. ప్రస్తుతం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే మూవీ చేస్తున్నాడు.
సుధీర్ బాబు (image credit : sudheer babu/Instagram)
సుధీర్ బాబు (image credit : sudheer babu/Instagram)
సుధీర్ బాబు (image credit : sudheer babu/Instagram)