Allu Arjun : అల్లు అర్జున్ గ్యారేజ్.. ఇది బాగా కాస్ట్లీ!
ఎంత బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా.. టాలెంట్ లేకపోతే ఎక్కవ రోజులు తమ కెరీర్ ను కొనసాగించలేరు. దీనికి ఉదాహరణగా చాలా మంది నటుల పేర్లు చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఆ విషయం పక్కన పెడితే.. మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి వచ్చి తన మార్క్ సృష్టించగలిగాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఒక పాత్ర కోసం ఎంతగా శ్రమిస్తారో తెరపై ఆయన్ని చూస్తేనే అర్ధమవుతుంది. టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ అనే ట్రెండ్ ను తీసుకొచ్చాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబన్నీ డాన్స్ ను ఎవరూ బీట్ చేయలేరు. ఎంత కష్టమైన స్టెప్పులైనా సరే చాలా అవలీలగా చేసేస్తుంటాడు. కానీ డాన్స్ కోసం ఎలాంటి శిక్షణ తీసుకోలేదు బన్నీ. చిన్నప్పటి నుండి జిమ్నాస్టిక్స్ చేయడంతో తన బాడీ డాన్స్ కు బాగా సహకరిస్తుందని చెబుతుంటాడు బన్నీ. చిరంజీవి అలానే మరింకొంతమందిని స్ఫూర్తిగా తీసుకొని డాన్స్ చేసేవాడినని.. అలా అలవాటు అయిందని గతంలో ఓ సారి చెప్పాడు.
బన్నీ డ్రాయింగ్స్ బాగా వేయగలడనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తనకు డాన్స్, డ్రాయింగ్ అంటే చాలా ఇష్టమని చెబుతుంటాడు బన్నీ. ఆర్కిటెక్చర్ డ్రాయింగ్స్ అంటే బన్నీకి చాలా ఇష్టం.
ఇక బన్నీ రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుంటే ఒక్కో సినిమాకి 15 నుండి 18 కోట్ల రూపాయలు తీసుకునే ఈ హీరో ఇప్పుడు తన రెమ్యునరేషన్ బాగా పెంచేశాడు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న 'పుష్ప' సినిమా రెండు భాగాలకు కలిపి దాదాపు యాభై నుండి అరవై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. 'పుష్ప' హిట్ అయితే బన్నీ డిమాండ్ మరింత పెరిగిపోతుంది.
ఈ మెగాహీరోకి కార్లంటే చాలా ఇష్టం. తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని వాటికోసమే ఖర్చు చేస్తుంటాడు. హీరోగా సంపాదించడం మొదలుపెట్టాక బన్నీ పోష్ కార్లు ఎన్నో కొన్నాడు. ఆయన గ్యారేజ్ మొత్తం కూడా లగ్జరీ కార్లతో నిండిపోయి ఉంటుందని చెబుతుంటారు.
ప్రస్తుతం బన్నీకి ఖరీదైన కార్వాన్ ఉన్న విషయం తెలిసిందే. దానికి ఫాల్కన్ అని పేరు కూడా పెట్టుకున్నాడు. దాని విలువ దాదాపు ఏడు నుండి పది కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ కార్వాన్ ను బన్నీ స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నాడు. ఇంటీరియర్ కోసం చాలానే ఖర్చు పెట్టాడు.
బన్నీ దగ్గరున్న కార్లలో వోల్వో ఎక్స్ సి 90 ఒకటి. దీని ధర రూ.90 నుండి కోటి వరకు ఉంటుంది.
బన్నీ ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న మరో కారు హమ్మర్ హెచ్ 2. ఈ కార్ బన్నీకి తగ్గట్లుగానే ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. దీని ధర కోటిన్నరకు పైగానే ఉంటుంది.
ఇవి కాకుండా జాగ్వార్ XJL, రేంజ్ రోవర్ రోగ్ అనే మరో రెండు లగ్జరీ కార్లను కొన్నాడు. వీటి ధర కూడా కోట్లలో ఉంటుంది. మొత్తానికి ఈ కార్లతో నిండిపోయిన గ్యారేజ్ టూ కాస్ట్లీ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇవి కాకుండా హైదరాబాద్ లో బన్నీ ఇల్లు వంద కోట్లకు దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు తన కోసం స్పెషల్ గా జూబ్లీహిల్స్ ఏరియాలో కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. దీనికోసం ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు.