Sreeleela: లవ్ యూ బేబీ.. మత్తు వదలరా 2 లో డ్రామా నక్కో మామ పాటకు శ్రీలీల ఫిదా!
శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా నటించిన మత్తువదలరా 2 సినిమా సూపర్ సక్సెస్ అయింది. విడుదలైనప్పటి నుంచీ దూసుకుపోతోంది. థియేటర్లలోకి దేవర వచ్చేవరకూ మత్తువదలరా 2 జోరు కొనసాగేలా ఉంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ మూవీ ప్రమోషన్లో భాగంగా డ్రామా నక్కో మామ అంటూ ఓ సాంగ్ విడుదల చేశారు..ఆ పాటను ఫరియా అబ్దుల్లా స్వయంగా రూపొందించడమే కాదు.. కొరియోగ్రఫీ కూడా తనే కావడంతో ఫరియాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి
ఫరియా రూపొందించి డ్రామా నక్కో మామ సాంగ్ ని పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాలో షేర్ చేశారు..ఈ సాంగ్ ని శ్రీలీల కూడా షేర్ చేిసంది.. సేమ్ టైమ్.. ఫరియా ప్రతిభను పొగిడేసింది..
ఫరియా ను ఆల్ ఇన్ వన్ అమ్మాయి అంటూ పొగడ్తల్లో ముంచెత్తిన శ్రీలీల..లవ్ యూ బేబీ అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. దీనిపై హ్యాపీగా స్పందించింది ఫరియా..
మత్తు వదలరా 2 తర్వాత పార్ట్ 3 రాబోతున్నట్టు డైరెక్టర్ రితేష్ రానా ఇప్పటికే ప్రకటించాడు. మరి పార్ట్ 3 లోనూ ఫరియా ఉంటుందో లేదో చూడాలి. మరోవైపు శ్రీలీల ఆ మధ్య చిన్న బ్రేక్ తీసుకుని మళ్లీ వరుస మూవీస్ తో దూసుకుపోతోంది.
పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజతో ఓ మూవీ, నితిన్ తో రాబిన్ హుడ్ మూవీస్ లో నటిస్తోంది.