ఎర్ర చీరలో అదరగొడుతున్న సమంత!
హీరోయిన్ సమంత తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె ఎర్ర చీరలో మెరిసిపోతూ కనిపించారు. వావ్ అనిపించేలా ఉన్న సమంతను ఆ ఫొటోల్లో చూడవచ్చు. ఆమె ఏదో షాప్ ఓపెనింగ్‌కు వెళ్లినట్లు ఫొటోలను బట్టి తెలుస్తోంది.
మయోసైటిస్ వ్యాధి నుంచి సమంత దాదాపుగా కోలుకున్నట్లే అనుకోవాలి. త్వరలో సమంత పోడ్‌కాస్ట్‌ను కూడా ప్రారంభించనున్నారు.
పోడ్‌కాస్ట్ గురించి ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు త్వరలో తిరిగి షూటింగ్‌లు కూడా స్టార్ట్ చేయనున్నారట.
2023లో సమంత నటించిన రెండు సినిమాలు విడుదల అయ్యాయి. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ‘శాకుంతలం’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘ఖుషి’ యావరేజ్‌గా నిలిచింది.
మరోవైపు ఓటీటీలో కూడా సమంత బిజీనే ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు.
కమ్‌బ్యాక్ తర్వాత సమంతకు ఎటువంటి ఆఫర్లు వస్తాయో చూడాలి.