✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Samantha Akkineni Twitter: సినిమా ప్రమోషన్స్ కోసం సమంత ఇంత పని చేసిందా..

ABP Desam   |  31 Jul 2021 02:10 PM (IST)
1

'ఏ మాయ చేసావే' సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది సమంత. అప్పటినుండి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో చెలామణి అవుతోంది. పెళ్లికి ముందు వరకు గ్లామరస్ రోల్స్ లో మెప్పించిన సమంత పెళ్లి తరువాత రూటు మార్చింది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. 

2

ఈ క్రమంలో ఆమె నటించిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఓ పక్క నటిగా బిజీగా ఉంటూనే మరోపక్క తన వ్యాపారాలను కూడా మ్యానేజ్ చేసుకుంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లలో ఇంటి పేరు 'అక్కినేని'ని తీసేసి అందరికీ షాకిచ్చింది. 

3

చాలాకాలం పాటు నాగచైతన్యతో డేటింగ్ చేసిన సమంత 2017లో అతడిని పెళ్లాడింది. పెళ్లైన తరువాత తన సోషల్ మీడియా అకౌంట్లలో అక్కినేని పదాన్ని యాడ్ చేసింది. ఆమె డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ అన్నింటిలో 'సమంత అక్కినేని' అనే ఉండేది. అయితే సడెన్ గా ఆమె తన పేరుని తొలగించి కేవలం 'ఎస్' అనే పదాన్ని మాత్రం డిస్‌ప్లే పేరుగా మార్చేసింది.

4

సమంత ఇలా అక్కినేని అనే పేరుని తీసేయడంతో అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఏమైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. కానీ 'ఎస్' అనే పదాన్ని సమంత తన డిస్‌ప్లేగా మార్చడానికి గల కారణం సినిమా ప్రమోషన్స్ అని తెలుస్తోంది. 

5

ఈ బ్యూటీ ప్రస్తుతం 'శాకుంతలం' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆమె పేరు శకుంతల. అందుకే 'ఎస్' అనే పదాన్ని డిస్‌ప్లే పేరుగా మార్చుకుందని సమాచారం. సినిమా ప్రమోషన్స్ కోసమే ఇలా చేసిందని తెలుస్తోంది. 

6

గతంలో చాలా మంది సెలబ్రిటీలు ఇలానే చేశారు. ఇప్పుడు సమంత కూడా అదే ఫార్ములా ఫాలో అయిపోతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Samantha Akkineni Twitter: సినిమా ప్రమోషన్స్ కోసం సమంత ఇంత పని చేసిందా..
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.