Devara Saif AliKhan: చెమట్లు పట్టాయ్.. వెన్నులో వణుకు పుట్టింది - 'దేవర' విలన్ సైఫ్ అలీ ఖాన్ కామెంట్స్ వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న మూవీ దేవర. రెండు భాగాలుగా విడుదలవుతోన్న ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబరు 27న థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీతో విలన్ గా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు సైఫ్ అలీ ఖాన్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్.. దేవరతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న సందర్భంగా ఈ మూవీ గురించి మాట్లాడుతూ సౌత్ మూవీలో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి షేర్ చేసుకున్నాడు
కొత్త భాష, ఇక్కడ ఎదురైన సవాళ్లు.. యంగ్ టైగర్ అండ్ టీమ్ తో వర్క్ చేసిన అనుభవం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. బాలీవుడ్ లో నటుడిగా ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్నప్పటికీ కొత్త ల్యాండ్‌స్కేప్‌లోకి అడుగుపెట్టడంతో కొత్తగా అనిపించిందన్నాడు సైఫ్ అలీ ఖాన్..
ఇప్పటికీ మొదటి షాట్ గుర్తుండిపోయిందని... ఫస్ట్ షాట్ లో తెలుగులో మాట్లాడడం గుర్తుంది..ఆ క్షణం చెమట్లు పట్టాయ్..వెన్నులో వణుకుపుట్టింది..అంతా కొత్తగా అనిపించిందని..దేవర ఓ ప్రత్యేకమైన సవాల్ అన్నాడు సైఫ్
తారక్-కొరటాల శివ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారని...ఈ మధ్య కాలంలో సౌత్ మూవీస్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి..ఇలాంటి టైమ్ లో ఈ సినిమాలో నటించే ఛాన్స్ రావడం హ్యాపీగా అనిపించిందన్నాడు సైఫ్
యంగ్ టైగర్ పక్కన హీరోయిన్ గా జాన్వికపూర్ నటించింది.. తెలుగులో జాన్వికి కూడా ఇదే ఫస్ట్ మూవీ. సైఫ్ విలన్ గా నటించడం, జాన్వి కపూర్ హీరోయిన్ కావడంతో బాలీవుడ్ లోనూ దేవరకు బాగానే కలిసొచ్చేలా ఉంది..