✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

RRR Song Dosti: ఫ్యాన్స్ బీ రెడీ.. 'దోస్తీ' సాంగ్ రెండో వెర్షన్ ఉందట.. 

ABP Desam   |  02 Aug 2021 02:42 PM (IST)
1

స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 'ఆర్ఆర్ఆర్' సినిమా నుండి 'దోస్తీ' సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటకు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ ఒక్క థీమ్ సాంగ్ కోసం మూడు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. హేమచంద్ర పాడిన ఈ పాట మొత్తం ఒక ఎత్తైతే పాట చివర్లో చరణ్, ఎన్టీఆర్ లు చేయి కలుపుతూ కనిపించి అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచారు.

2

అయితే ఈ పాటకు ఇది ఒక వెర్షన్ మాత్రమేనని సమాచారం. మరో వెర్షన్ కూడా ఉందట. దాన్ని మాత్రం సినిమాలోనే చూడాలి. ఈ 'దోస్తీ' పాటలో మాత్రం చిత్రబృందం అంతా కనిపిస్తుంది. రాజమౌళి దగ్గర నుండి సినిమాకి పని చేసిన టెక్నీషియన్లు, నటీనటులంతా ఈ పాటలో కనిపిస్తారు. సినిమా మొత్తం ఈ పాట బిట్లు బిట్లుగా వినిపిస్తుంది. 

3

చివర్లో మాత్రం ఎండింగ్ టైటిల్ లో చిత్రబృందం అంతా కలిసి ఈ పాటలో కనిపించి కనువిందు చేయబోతుంది. ఈ సినిమాలో మిగిలిన పాతాళ లిరికల్ వీడియోలను సైతం ఇలానే కొత్తగా డిజైన్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. దానికోసం స్పెషల్ గా ఓ బడ్జెట్ కూడా అనుకున్నారట. 

4

రాజమౌళి తన సినిమాలన్నిటికీ కీరవాణినే సంగీత దర్శకుడిగా తీసుకుంటారు. ఆయన కూడా తన మ్యూజిక్ తో సినిమా స్థాయిని మరింత పెంచుతారు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' విషయంలో కీరవాణి తన బెస్ట్ ఇచ్చారని ఒక్క థీమ్ సాంగ్ తో చెప్పకనే చెప్పారు. 

5

తెలుగులో ఈ పాటను హేమచంద్ర పాడగా.. హిందీలో అమిత్ త్రివేది.. తమిళంలో అనిరుద్.. కన్నడలో యాజిన్ నైజర్.. మలయాళంలో విజయ్ ఏసుదాస్ ఆలపించారు. అన్ని భాషల్లో ఈ థీమ్ సాంగ్ సూపర్ హిట్ అయింది. మిలియన్లలో వ్యూస్ అందుకుంటూ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. 

6

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా అలియా భట్.. ఎన్టీఆర్ కి జోడీగా ఒలీవియా మోరీస్‌ కనిపించనున్నారు. వీరితో పాటు రేయ్‌ స్టీవ్‌సన్‌, ఆలిసన్‌ డ్యూడీ, శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖనిలు కీలకపాత్రలు పోషించారు.  

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • RRR Song Dosti: ఫ్యాన్స్ బీ రెడీ.. 'దోస్తీ' సాంగ్ రెండో వెర్షన్ ఉందట.. 
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.