రిషబ్ శెట్టికి దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు, పునీత్ రాజ్ కుమార్ కు అంకితమిచ్చిన ‘కాంతార’ నటుడు
చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకు సినిమా ‘కాంతార’. రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళు చేసింది. ఈ చిత్రంలో నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం దక్కింది. Photo Credit: Rishab Shetty/Instagram
సినీ రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రిషబ్ అందుకున్నారు. Photo Credit: Rishab Shetty/Instagram
ముంబైలో జరిగిన దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రిషబ్ 2023 సంవత్సరానికి గానూ రిషబ్ శెట్టికి ఈ అవార్డు అందించారు. ఈ విషయాన్ని ఆయన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. Photo Credit: Rishab Shetty/Instagram
‘కాంతార’ ఘన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డుతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ పురస్కారం దక్కడం గౌరవంగా భావిస్తున్నానన్న ఆయన.. తనను నమ్మి అవకాశం ఇచ్చిన హోంబాలే ఫిల్మ్స్ కు, విజయ్ కిరగందూర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తన భార్య ప్రగతి శెట్టికి, మద్దతు ఇచ్చిన కాంతారావు బృందానికి, సాంకేతిక నిపుణులకు రిషబ్ శెట్టి ధన్యవాదాలు తెలిపారు. Photo Credit: Rishab Shetty/Instagram
ఈ అవార్డును దివంగత కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్, లెజెండరీ డైరెక్టర్ ఎస్‌కె భగవాన్‌లకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. Photo Credit: Rishab Shetty/Instagram
ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ సంస్థ రిషబ్ శెట్టికి అభినందనలు తెలిపింది. ఆయన హార్డ్ వర్క్, అంకితభావం అద్భుతంగా ఫలించాయని తెలిపింది. ఈ డ్రీమ్ రన్ కొనసాగాలని, మరెన్నో విజయాలు సాధించానలి కోరుకుంటున్నట్లు ట్వీట్ చేసింది. మరోవైపు హోంబలే ఫిల్మ్స్ ‘కాంతార’ ప్రీక్వెల్‌ను చిత్రీకరిస్తున్నది.Photo Credit: Rishab Shetty/Instagram
రిషబ్ ఇటీవల బెంగళూరులోని రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి డిన్నర్ చేశారు. దేశంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని మోదీతో పంచుకున్నట్లు తెలిపారు. సినీ ఇండస్ట్రీకి చెందిన కొన్ని డిమాండ్లను కూడా ప్రధాని నోట్ చేసుకున్నట్లు వెల్లడించారు. కన్నడ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే ‘కాంతార’ మూవీని తీసినందుకు తమను అభినందించినట్లు చెప్పారు.Photo Credit: Rishab Shetty/Instagram