Riddhi Kumar Photos: మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన షోకి జడ్జిగా రావడం గర్వంగా ఉందన్న నార్త్ ఇండియన్ బ్యూటీ
లవర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నార్త్ ఇండియన్ బ్యూటీ రిద్ధికుమార్. రాజ్ తరుణ్ కి జోడీగా తెలుగులో అడుగుపెట్టిన రిద్దికుమార్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆతర్వాత అనగనగా ఓ ప్రేమకథ మూవీలో నటించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలవర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రిద్ది కుమార్..మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా అడుగులు వేసింది. అయితే ఫస్ట్ ఒక ప్రేమ కథ సినిమాలో రిద్ధికుమార్ నటించింది. వీటి తర్వాత మలయాళంలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది.
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ లో రిద్ధి కుమార్ కీలక పాత్రలో కనిపించింది. సినిమాలో కనిపించింది కొద్దిసేపే అయినా కథని కీలక మలుపు తిప్పే క్యారెక్టర్ ఆమెది. బాలీవుడ్ లో సలామ్ వెంకీ మూవీలోనూ నటించింది.
సినిమాలతో పాటూ వెబ్ సిరీస్ లలోనూ ఆఫర్లు అందుకుంటోంది. గ్లామర్ షో విషయంలోనూ తగ్గేదే లే అన్నట్టుంటుంది రిద్ది. హాట్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది
తాజాగా రిద్ధి కుమార్ ఓ బ్యూటీ కంటెస్ట్ కి జడ్జ్ గా హాజరైంది. ఈ ఈవెంట్ లో రిద్ధి కుమార్ గోల్డ్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని మెరిసిపోయింది. 10 ఏళ్ళ క్రితం ఇదే బ్యూటీ కంటెస్ట్ లో పాల్గొని విన్ అయ్యానని...ఇప్పుడు ఇదే షోకి జడ్జిగా రావడం ఆనందంగా ఉందని పోస్ట్ పెట్టింది.