వెకేషన్‌లో నేషనల్ క్రష్ - లేటెస్ట్ ఫొటోలు చూశారా?
ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆమె ఎక్కడికో టూర్‌కి వెళ్లి అక్కడి పిక్స్ షేర్ చేశారని అర్థం చేసుకోవచ్చు. రష్మికను నేషనల్ క్రష్ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2016లో వచ్చిన ‘కిరిక్ పార్టీ’ రష్మిక సినిమాల్లో అడుగుపెట్టారు. ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. స్వతహాగా కర్ణాటకకు చెందిన రష్మిక కన్నడ సినిమాలతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
అనంతరం ‘అంజనీ పుత్ర’, ‘ఛమక్’ అనే రెండు కన్నడ సినిమాల్లో నటించారు. 2018లో వచ్చిన ‘ఛలో’ సినిమాతో రష్మిక మందన్న టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. మొదటి అడుగులోనే బ్లాక్‌బస్టర్ అందుకున్నారు.
అదే సంవత్సరం వచ్చిన ‘గీత గోవిందం’తో రష్మిక స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయారు. ఈ సినిమాలో తన నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి.
2019లో మరోసారి ‘డియర్ కామ్రేడ్’తో విజయ్ సరసన రష్మిక జోడి కొట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత ఆడకపోయినా మంచి రెస్పెక్ట్‌ను సంపాదించుకుంది.
ప్రస్తుతం పాన్ ఇండియా ‘పుష్ఫ 2’లో నటిస్తూ బిజీగా ఉన్నారు. దీనికి ముందు భాగంగా వచ్చిన ‘పుష్ప: పార్ట్ 1’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తమిళ, హిందీ భాషల్లో కూడా రష్మిక సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.