Rashmika Mandanna : ఆరెంజ్ డ్రెస్‌లో క్యూట్‌గా ఉన్న రష్మిక.. పండుగరోజూ పని చేస్తున్నానంటూ నిట్టూర్పు
రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. సంక్రాంతి సందర్భంగా ట్రెడీషనల్ లుక్‌లో ఉన్న ఫోటోలు అభిమానులతో పంచుకుంది. వాటికి Wishing my darling loves all the happiness, joy and goodness 🫶🏻🤍 मकर संक्रांति 🧡 பொங்கல்🧡 మకర సంక్రాంతి🧡 ಮಕರ ಸಂಕ್ರಾಂತಿ 🧡 പൊങ്കല്🧡 ਲੋਹੜੀ 🧡 అంటూ వివిధ భాషల్లో విషెష్ చెప్పింది.(Image Source : Instagram/rashmika_mandanna)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆరెంజ్ డ్రెస్‌లో జ్యూవెలరీ పెట్టుకుని.. తలను ముడి వేసి రష్మిక ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే ఇన్‌స్టా స్టోరీలో మాత్రం పండుగరోజూ కూడా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలిపింది. (Image Source : Instagram/rashmika_mandanna)
యానిమయానిమల్ మూవీతో భారి హిట్ అందుకుంది రష్మిక. ఏ సర్టిఫికెట్తో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా, రష్మిక హీరోయిన్గా నటించారు.(Image Source : Instagram/rashmika_mandanna)
రష్మిక ప్రస్తుతం పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తుంది. పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. నా సామి రారా సామి అనే పాటకు ఎన్ని స్టేజిల మీద స్టెప్పులు వేసిందో లెక్కే లేదు.(Image Source : Instagram/rashmika_mandanna)
ఛలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి శకునం అందుకుంది రష్మిక. తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి గీతాగోవిందం సినిమా చేసింది. ఈ సినిమా మంచి హిట్ టాక్ అందుకుంది. అందులోని రష్మిక నటనకు చాలామంది ఫిదా అయిపోయారు.(Image Source : Instagram/rashmika_mandanna)
తర్వాత తెలుగులో పలు సినిమాలతో విజయాలను చవి చూసింది. తమిళంలో, కన్నడతో పాటు బాలీవుడ్‌కి కూడా వెళ్లిపోయింది. అగ్రహీరోల సరసన అవకాశాలు కొట్టేసింది. చేతినిండా మంచి ప్రాజెక్టులతో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది ఈ హీరోయిన్.(Image Source : Instagram/rashmika_mandanna)