Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్‌లో చిరంజీవి, రామ్ చరణ్ సందడి - ఫోటోలు వైరల్

Image Credit: Twitter
Megastar Attends Director Shankar Daughter Wedding Reception: తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం గ్రాండ్‌గా జరిగింది.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా తరుణ్ కార్తికేయన్‌తో ఐశ్వర్య వివాహం రెండు రోజుల క్రితం జరగగా నిన్న గ్రాండ్ రిసెప్షన్ జరిగింది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
అలాగే టాలీవుడ్ నుంచి కూడా పలువురు స్టార్స్ హాజరయ్యారు. ఇక మెగా ఫ్యామిలీ సైతం ఈ రెసెప్షన్‌లో పాల్గొని సందడి చేసింది. శంకర్ కూతురు ఐశ్వర్య పెళ్లి రిసెప్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌లు సతీసమేతంగా హాజరయ్యారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ రిసెప్షన్ వేడుకలో టాలీవుడ్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా హజరయ్యారు.
కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఈ వేడుకులో సందడి చేసింది. మరోవైపు రెండు రోజుల క్రితం జరిగిన శంకర్ కూతురు పెళ్లిలో తమిళ్ ఇండస్ట్రీకి చెందిన అగ్ర నటీనటులంతా పాల్గొన్నారు.
కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఈ వేడుకులో సందడి చేసింది. మరోవైపు రెండు రోజుల క్రితం జరిగిన శంకర్ కూతురు పెళ్లిలో తమిళ్ ఇండస్ట్రీకి చెందిన అగ్ర నటీనటులంతా పాల్గొన్నారు.
కాగా ఐశ్వర్య గతంలో తమిళ్ క్రికెటర్ రోహిత్ వివాహం జరగ్గా ఏడాది కాలంలోనే వారికి విడాకులు అయిన సంగతి తెలిసిందే. ఐశ్వర్యకు ఇది రెండో పెళ్లి.