Rakul Preet : రకుల్ ప్రీత్ సింగ్ మెహందీ ఫోటోలు చూశారా?
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా వీరిద్దరూ తమ మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేశారు.(Images Source : Instagram/rakulpreet)
మెహందీ వేడుకగా వీరు ధరించిన డ్రెస్‌లు ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రకుల్ ధరించి అద్దాల లెహంగా చాలా బాగుంది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/rakulpreet)
చెవులకు పెద్ద ఝుంకాలు పెట్టుకుని.. తలలో పాపిడి బిళ్లతో పొడవాటి జడ వేసుకుని.. చేతులకు మెహందీ డిజైన్ వేయించుకుని రకుల్ చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/rakulpreet)
దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వెడ్డింగ్‌కు బాలీవుడ్ స్టార్స్ గోవా వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.(Images Source : Instagram/rakulpreet)
రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ మూడేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. 2021 అక్టోబర్‌లో బర్త్‌డే సందర్బంగా రకుల్ తన సోల్‌మేట్‌ను వెతుక్కున్నానంటూ జాకీ భగ్నానీని పరిచయం చేసింది. (Images Source : Instagram/rakulpreet)
కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. మూడేళ్లు ప్రేమించుకున్న వీరు ఈనెల 21న పెళ్లితో ఒక్కటయ్యారు. (Images Source : Instagram/rakulpreet)