Pragya Jaiswal: అందాలకు ఎల్లో శారీతో కంచె వేసిన అఖండ 2 బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్!
2014లో విరుట్టు అనే తమిళ్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ప్రగ్యా జైశ్వాల్.. 2015లో బిగ్‌బాస్ అభిజిత్ హీరోగా తెరకెక్కిన మిర్చి లాంటి కుర్రోడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది
వరుణ్ తేజ్ - క్రిష్ కాంబినేషన్లో వచ్చిన కంచె మూవీతో సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర మూవీస్ లో మెరిసింది..
వరుస ఆఫర్లు అందుకుంది కానీ కెరీర్ ని మలుపుతిప్పే హిట్ అందుకోవడంలో ఫెయిల్ అయిందనే విమర్శలు ఎదుర్కొంది ప్రగ్యా జైశ్వాల్. అలాంటి టైమ్ లో బాలకృష్ణ-బోయపాటి అఖండలో ఆఫర్ అందుకుని బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది.
అఖండ తర్వాత కూడా అడపా దడపా ఆఫర్లు అందుకున్నా మళ్లీ హిట్ పడలేదు.. అఖండ కు సీక్వెల్ గా వస్తోన్న అఖండ 2లో నటిస్తోంది
టీమిండియా క్రికెటర్ శుభమన్ గిల్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయ్ ..ఆ విషయంపై మాట్లాడుతూ ప్రగ్యా మెలికల్ తిరగడంలో ఇద్దరి మధ్యా సమ్ థింగ్ సమ్ థింగ్ అని ఫిక్సైపోయారు
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రగ్యా లేటెస్ట్ గా షేర్ చేసిన శారీ ఫొటోషూట్ వైరల్ అవుతోంది
ఎల్లో శారీలో ఎల్లోరా శిల్పంలా ఉంది ప్రగ్యా జైశ్వాల్