Pooja Hegde : పర్ ఫెక్ట్ బర్త్ డే డ్రెస్ వేసుకున్న పూజ హెగ్డే .. అలవైకుంఠపురంలో సాంగేసుకుంటున్న నెటిజన్లు!

పూజ హెగ్డే లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/Pooja Hegde)
అక్టోబరు 13 బుట్టబొమ్మ బర్త్ డే. ఈ సందర్భంగా చిట్టిపొట్టి డ్రెస్సులో ముద్దుగా ముస్తాబైంది.. ఆ ఫొటోస్ ఇవే...
పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు..స్టార్ హీరోలతో నటించి హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేసింది..
ప్రస్తుతం టాలీవుడ్ లో పూజాకి పెద్దగా ఆఫర్లు లేకపోయినా కానీ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటోంద..
అరవింద సమేత, అలా వైకుంఠపురంలో లాంటి భారీ హీట్స్ తో పూజా క్రేజ్ మారిపోయింది. నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పూజా..కెరీర్ జోరుమీదున్నప్పుడే రంగస్థంలో జిగేల్ రాణి సాంగ్ కి స్టెప్పులేసింది
స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న టైమ్ లో ఆచార్య మూవీ ఫ్లాప్ అమ్మడి జోరు తగ్గింది. ఆ సినిమా తర్వాత పూజాకి చెప్పుకోదగిన హిట్ పడలేదు
టాలీవుడ్ లో మాత్రమే కాదు..తమిళం, హిందీలోనూ పూజాకి సక్సెస్ రాలేదు..