Top 10 Malayalam Movies 2025: డీయస్ ఈరే to కొత్త లోక... 2025లో టాప్ 10 మలయాళ సినిమాలు - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెల్సా?
'డీయస్ ఈరే' హారర్ థ్రిల్లర్ సినిమా. దీనికి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రణవ్ మోహన్ లాల్, సుష్మిత భాట్, గిబిన్ గోపినాథ్, జయ కురుప్, అరుణ్ అజీకుమార్, శ్రీధన్య, మదన్ బాబు కె, సుధా సుకుమారి, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కథ రోహన్ చుట్టూ తిరుగుతుంది. అతను ఒక ఇండియన్ అమెరికన్, ఆర్కిటెక్ట్ కొడుకు. కేరళలోని ఒక ఖరీదైన ప్రాంతంలో సౌకర్యవంతమైన, విలాసవంతమైన సంపన్న జీవితాన్ని గడుపుతాడు. కానీ అతని ఓల్డ్ ఫ్రెండ్ కణి అకస్మాత్తుగా మరణిస్తుంది. దాంతో అతని జీవితం మారుతుంది. మీరు ఈ సినిమాను జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు.
2025లో వచ్చిన మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'రేఖాచిత్రం'. ఈ సినిమాలో ఆసిఫ్ అలీ, అన్సవరా రాజన్, మనోజ్ కె జయన్, సిద్ధిఖీ, జగదీష్, హరిశ్రీ అశోకన్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. సస్పెండ్ చేయబడిన పోలీస్ అధికారి (ఆసిఫ్ అలీ) చుట్టూ సినిమా కథ తిరుగుతుంది, అతనికి 40 సంవత్సరాల నాటి కేసును పరిష్కరించే అవకాశం లభిస్తుంది. మీరు ఈ సినిమాను సోనీ లివ్ లో చూడవచ్చు.
ఈ ఏడాది వచ్చిన మలయాళీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'. దీనికి జితు అష్రాఫ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కుంచాకో బోబన్, ప్రియమణి, జగదీష్, విశాల్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కొచ్చిలో తన భార్య, పిల్లలతో క్రమశిక్షణతో కూడిన జీవితం గడిపే సర్కిల్ ఇన్స్పెక్టర్ హరిశంకర్ చుట్టూ కథ తిరుగుతుంది. నకిలీ బంగారు ఆభరణాల కేసు విచారణలో అనేక రహస్యాలు వెలుగులోకి వస్తాయి. మీరు ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా 'హృదయ పూర్వం'. సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ తో పాటు మాళవిక మోహనన్, సంగీత్ ప్రతాప్, సబితా ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించారు. సందీప్ బాలకృష్ణన్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. అతను కొచ్చిలో క్లౌడ్ కిచెన్ నడుపుతాడు. అతనికి గుండె మార్పిడి జరుగుతుంది. ఆ గుండె దాత కుమార్తె హరిత కుటుంబంతో కొంత సమయం గడపవలసి వస్తుంది. ఆ సమయంలో అతని జీవితం మారుతుంది. మీరు ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడవచ్చు.
మలయాళంలో ఈ ఏడాది వచ్చిన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ 'పోన్‌మాన్'. జ్యోతిష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్, సాజిన్ గోపు, లిజోమోల్ జోస్, ఆనంద్ మన్మధన్, దీపక్ పరంబోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. పి.పి. అజీష్ (బసిల్ జోసెఫ్) పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. అతను ఒక జ్యువెలరీ సేల్స్ ఏజెంట్. పెళ్లి కూతురు కుటుంబానికి బంగారు ఆభరణాలు ఇచ్చి, అందుకు బదులుగా వివాహంలో వచ్చే నగదు బహుమతులు తీసుకుంటాడు. ఓ పెళ్లిలో జరిగిన అంశాలు ఎన్ని మలుపులు తీసుకున్నారు? అనేది సినిమా. మీరు ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడవచ్చు.
సూపర్ నేచురల్ కామెడీ ఫిల్మ్ 'పడక్కలం'. మను స్వరజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సందీప్ ప్రదీప్, సూరజ్ వెంజరమూడు, షరఫ్ యూ ధీన్, ఇషాన్ శౌకత్ ప్రధాన పాత్రల్లో నటించారు. నలుగురు కామిక్ బుక్ ప్రేమికుల చుట్టూ కథ తిరుగుతుంది. కళాశాల జీవితంలో ఒక కొత్త ప్రొఫెసర్ ప్రవేశిస్తాడు. అతను చూడటానికి మంచి స్వభావం కలిగి ఉన్నప్పటికీ, అతనిలో ఒక ప్రమాదకరమైన మనస్సు ఉంది. మాయాజాలంతో శరీరాన్ని మార్చుకునే సామర్థ్యం అతనికి ఉందని నమ్ముతారు. మీరు ఈ సినిమాను డిస్నీ+ హాట్‌స్టార్‌లో చూడవచ్చు.
మిస్టరీ కామెడీ థ్రిల్లర్ 'డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్'. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మమ్ముట్టి, గోకుల్ సురేష్, సుష్మితా భాట్ ప్రధాన పాత్రల్లో నటించారు. డొమినిక్ (మమ్ముట్టి) చుట్టూ కథ తిరుగుతుంది. అతను మాజీ పోలీసు అధికారి. ఇప్పుడు ప్రైవేట్ డిటెక్టివ్. అతనికి ఒక మహిళ తన పర్సు పోయిందని, కనిపెట్టమని అడుగుతుంది. అది మొదట సులభంగా అనిపిస్తుంది. కానీ అతను విచారణ చేస్తున్నప్పుడు కేసు మరింత క్లిష్టమవుతుంది. తప్పిపోయిన వ్యక్తులు / హత్యల రహస్యాలు వెలుగులోకి వస్తాయి. మీరు ఈ సినిమాను జీ5 లో చూడవచ్చు.
'ఆలప్పుళా జింఖానా' స్పోర్ట్స్ కామెడీ డ్రామా. ఖాలిద్ రహమాన్ దర్శకత్వం వహించారు. ఇందులో నస్లెన్, లుక్మాన్ అవరాన్, అనఘా మయా రవి ప్రధాన పాత్రల్లో నటించారు. జోజో జాన్సన్, అతని స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది. వీళ్ళలో చాలా మంది స్నేహితులు ఫెయిల్ అయ్యారని తెలిసినప్పుడు... కళాశాలలో ప్రవేశం పొందడానికి స్పోర్ట్స్ కోటా మార్గాన్ని ఎంచుకోవాలని ప్లాన్ చేస్తారు. సులభమైన మార్గంగా భావించి, వారు బాక్సింగ్ను ఎంచుకుంటారు. అయితే ఆటలో ఎటువంటి అనుభవం లేదు. అప్పుడేం చేశారు? అనేది సినిమా చూడాలి. మీరు ఈ సినిమాను సోనీ లివ్లో చూడవచ్చు.
క్రైమ్ డ్రామాగా రూపొందిన చిత్రం 'తుడరం'. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్‌లాల్, శోభన, ప్రకాష్ వర్మ, ఫర్హాన్ ఫాసిల్, మణియంపిల్ల రాజు, బిను పప్పు, ఇర్షాద్ అలీ, ఆర్ష చాందిని బైజు ప్రధాన పాత్రలు పోషించారు. ఒక సాదాసీదా టాక్సీ డ్రైవర్ చుట్టూ కథ తిరుగుతుంది. అతను ఏం చేశాడు? అనేది జియో హాట్ స్టార్ ఓటీటీలోని సినిమా చూసి తెలుసుకోవాలి.
సూపర్ హీరో యాక్షన్ సినిమా 'కొత్త లోక'. డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ అతిథి పాత్రల్లో నటించారు. స్వీడన్ నుంచి కర్ణాటకకు పిలిపించబడిన ఒక రహస్య మహిళ అయిన చంద్ర చుట్టూ కథ తిరుగుతుంది. బెంగళూరులోని ఒక కేఫ్‌లో రాత్రి షిఫ్ట్‌లో పనిచేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది చంద్ర. తన గుర్తింపును దాచిపెడుతుంది. కానీ ఆమె ఒక ప్రమాదకరమైన సిండికేట్‌లో చిక్కుకున్నప్పుడు అసలు రూపం బయటపడుతుంది. జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూడవచ్చు.