Tamannaah Bhatia Movies On OTT: బాహుబలి నుంచి ఓదెల 2 వరకు... తమన్నా బెస్ట్ మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
తమన్నా భాటియా తన నటన, గ్లామర్‌తో ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్, సౌత్ సినిమాలలో అనేక పాత్రలు పోషించింది. OTT ప్లాట్‌ఫారమ్‌లో ఆమె ఉత్తమ చిత్రాలను చూడాలనుకుంటే... ఈ టైటిల్స్ మీ కోసమే
బాహుబలి ద బిగినింగ్: తమన్నా భాటియాకి అత్యంత గుర్తుండిపోయే సినిమాలలో ఇది ఒకటి. ఇందులో ఆమె చిన్న పాత్ర పోషించింది. ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయడానికి అందుబాటులో ఉంది.
స్త్రీ 2: హిందీలో సూపర్ హిట్ హారర్ కామెడీ, స్త్రీ సిరీస్ లో తాజా సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది. చిన్న పాత్ర పోషించింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది.
అరణ్మనై 4: తమన్నా నటించిన తమిళ సూపర్ హిట్ హారర్ కామెడీ ఇది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ఓదెల 2: ఇదొక సూపర్‌నేచురల్ థ్రిల్లర్ సినిమా. ఇందులో తమన్నా శక్తివంతమైన పాత్ర పోషించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ధర్మ దురై: విజయ్ సేతుపతి జంటగా నటించిన తమిళ డ్రామా ఇది. తమన్నా బలమైన పాత్ర పోషించారు. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమాను చూడవచ్చు.
కన్నే కలైమానే: తమిళంలో ఉదయనిధి స్టాలిన్ జంటగా తమన్నా నటించిన చిత్రమిది. రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో రూపొందించబడింది. ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
సికిందర్ కా ముకద్దర్: ఇది ఒక హిస్ట్ థ్రిల్లర్ సినిమా. ఇందులో తమన్నా ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.