Michael OTT: 'మైఖేల్' జాక్సన్ బయోపిక్ స్ట్రీమింగ్... ఒకటి కాదు, రెండు ఓటీటీల్లో - కానీ ట్విస్ట్ ఏమిటంటే?

మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా రూపొందిన 'మైఖేల్' బయోపిక్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియో, బుక్ మై షోలలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, ఒక ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే? (Image Courtesy: michaelmovie / Instagram)
Michael OTT Platform Release Date: పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ జీవితంపై తెరకెక్కిన సినిమా 'మైఖేల్'. ఇప్పుడీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా ఒకటి కాదు... ఇండియాలో రెండు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, బుక్ మై షో... రెండు యాప్‌లలో 'మైఖేల్' అందుబాటులో ఉంది. (Image Courtesy: michaelmovie / Instagram)
ఓటీటీలో 'మైఖేల్' జాక్సన్ బయోపిక్ చూడాలంటే... సబ్‌స్క్రిప్షన్ ఉంటే సరిపోదు. సబ్‌స్క్రైబర్‌లకు ఉచితంగా సినిమాను చూపించడం లేదు. ప్రీమియం రెంటల్... అంటే అద్దె పద్ధతిలో చూడాలి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రూ. 399, బుక్ మై షోలో రూ. 499 చెల్లిస్తే సినిమాను చూడవచ్చు. (Image Courtesy: michaelmovie / Instagram)
హాలీవుడ్‌లో తెరకెక్కిన 'మైఖేల్'ను భారతీయ ప్రేక్షకుల కోసం హిందీలో డబ్బింగ్ చేశారు. ఇండియాలో హిందీ డబ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. (Image Courtesy: michaelmovie / Instagram)
'మైఖేల్' చిత్రానికి ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహించారు. ఇందులో మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్ర పోషించారు. తెరపై మావయ్య పాత్రలో నటించారు. సినిమాలో మైఖేల్ బాల్యంతో పాటు ఆయన గ్లోబల్ సూపర్ స్టార్‌గా ఎదిగిన తీరు, కుటుంబ సంబంధాలను చూపించారు. (Image Courtesy: michaelmovie / Instagram)
ఓటీటీలో 'మైఖేల్' విడుదలైనప్పటికీ... హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ సినిమా ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. సిల్వర్ స్క్రీన్ మీద సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. (Image Courtesy: michaelmovie / Instagram)
ప్రపంచవ్యాప్తంగా 'మైఖేల్' బయోపిక్ దాదాపు వన్ బిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన బయోపిక్‌గా రికార్డు క్రియేట్ చేసే దిశగా ముందుకు సాగుతోంది. (Image Courtesy: michaelmovie / Instagram)