Keerthy Suresh Suhas: కీర్తీతో సుహాస్ 'ఉప్పు కప్పురంబు' - క్రేజీ, ఫన్ రైడ్ గ్యారెంటీ అంటోన్న హీరో
మహానటి కీర్తీ సురేష్ జోరు మీద ఉంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. లేటెస్టుగా ఆమె ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ చేసింది. ఆ సినిమా పేరు 'ఉప్పు కప్పురంబు'. ఈ సినిమాలో హీరో సుహాస్. ఇతర టెక్నీషియన్ల గురించి తెలుసా?
Uppu Kappurambu Movie Director: ఉప్పు కప్పురంబు సినిమాకు తమిళ దర్శకుడు ఐవి శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు ఆయన పలు సినిమాలు చేశారు. తెలుగులో 'కాళీ', 'గురు', 'మంచివారు మావారు' సినిమాలు చేశారు. సుమారు 35 ఏళ్ళ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న తెలుగు చిత్రమిది.
'కలర్ ఫోటో'తో హీరోగా ప్రేక్షకులను, విమర్శకులను నటుడిగా మెప్పించడమే కాదు, హీరోగా విజయం కూడా అందుకున్నాడు సుహాస్. ఆ తర్వాత 'రైటర్ పద్మభూషణ్', 'ప్రసన్నవదనం' వంటి హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు మరోసారి హీరోగా మాంచి సినిమా చేసినట్టు అర్థం అవుతోంది.
'ఉప్పు కప్పురంబు' సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా హీరో సుహాస్, ఫ్రెండ్స్, మూవీ టీమ్ కలిసి కేక్ కట్ చేశారు. అప్పుడు తీసిన ఫోటో ఇది.
కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నటించిన 'రఘు తాత' సినిమా ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. మరికొన్ని సినిమాలు ఆవిడ చేతిలో ఉన్నాయి.