Nuvve Nuvve Movie: ‘నువ్వే నువ్వే’ 20 ఏండ్ల వేడుక
ABP Desam | 11 Oct 2022 12:00 PM (IST)
1
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియ హీరో హీరోయిన్లుగా నటించారు.
2
ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవి కిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
3
ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, శిల్పా చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
4
అక్టోబర్ 10(2022) నాటికి ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఏఎంబీ సినిమాస్ లో స్పెషల్ షో వేశారు. ఈ ప్రదర్శనలో సినిమా యూనిట్ పాల్గొన్నది.
5
షో అనంతరం నాటి ఈ సినిమా అనుభవాలను దర్శక నిర్మాతలు, నటీనటులు పంచుకున్నారు. సిరివెన్నెలకు నివాళిగా 'నువ్వే నువ్వే'అంకితం ఇస్తున్నట్లు త్రివిక్రమ్, స్రవంతి రవికిశోర్ వెల్లడించారు.