Nivetha Pethuraj: పరువు వెబ్ సిరీస్ టైమ్ లో నివేదా పేతురాజ్ టెస్ట్ లుక్ ఫొటోస్ ఇవి!
‘మెంటల్ మదిలో’ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నివేదా పేతురాత్..ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. తెలుగు, తమిళంలో హీరోయిన్ గా మెరిసింది. మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఆ మధ్య బ్లడీ మేరీతో హిట్టందుకున్న నివేదా రీసెంట్ గా పరువు సిరీస్ తో మరో సక్సస్ తన ఖాతాలో వేసుకుంది
ఫార్ములా వన్ రేస్ అంటే నివేదాకు చాలా ఇంట్రెస్ట్.. రేస్ లో దూసుకెళుతుంటే ఆ థ్రిల్లే వేరంటుంది.ఆ టైమ్ లో తనకు మరేదీ గుర్తురాదంటోంది.
విభిన్నమైన పాత్రల్లో నటించడం ఇష్టం అన్న నివేదా.. కథ, క్యారెక్టర్ రెండూ నచ్చితేనే నటిస్తానని క్లారిటీ ఇచ్చేసింది
తమిళనాడులో పుట్టిపెరిగిన నివేదా తల్లిది ఆంధ్ర..ఆమె పెరిగింది మాత్రం దుబాయ్ లో. మిస్ ఇండియా దుబాయ్ పోటీలో గెలిచిన తర్వాత తమిళ సినిమాల్లో ఆఫర్స్ అందుకుంది. బన్నీతో కలసి నటించిన ‘అల వైకుంఠపురుములో’ మంచి గుర్తింపు ఇచ్చింది..ఆ తర్వాత రెడ్, పాగల్ మూవీస్ లోనూ నటించింది.
నివేదా పేతురాజ్(Image credit: Nivethapethuraj/Instagram)