✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Aham Reboot: ఆహాలో 'అహం రీబూట్'కి సూపర్ రెస్పాన్స్ - 20 రోజుల్లో రెండు కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్

S Niharika   |  20 Jul 2024 11:45 AM (IST)
1

సుమంత్ కథానాయకుడిగా యువ దర్శకుడు ప్రశాంత్ తెరకెక్కించిన సినిమా 'అహం రీబూట్'. ఈ చిత్రాన్ని రఘువీర్ ప్రొడ్యూస్ చేశారు. జూలై 1న హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ వేదిక ఆహా వీడియోలో డైరెక్టుగా రిలీజ్ అయ్యింది. 

2

'ఆహా' ఓటీటీ వేదికలో 'అహం రీబూట్' సినిమాకు వస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని దర్శక నిర్మాతలు ప్రశాంత్, రఘువీర్ తెలిపారు. 20 రోజుల్లో రెండు కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకు వెళుతోంది. ఈ 'అహం రీబూట్' విషయానికి వస్తే... ఇదొక ప్రయోగాత్మక సినిమా. ఇందులో సింగిల్ క్యారెక్టర్ మాత్రమే ఉంది. స్క్రీన్ మీద సుమంత్ ఒక్కరే కనిపిస్తారు. 

3

'అహం రీబూట్'లో ఆర్జే నిలయ్ పాత్రలో సుమంత్ నటించారు. ఆయన కెరీర్‌లో ఈ తరహా క్యారెక్టర్ గానీ, సింగిల్ రోల్ సినిమా గానీ ఇప్పటి వరకు చేయలేదు. దాంతో ఈ సినిమా ఆయనకు ప్రత్యేకమని చెప్పాలి. పైగా, ఇటువంటి ప్రయోగాత్మక సినిమాకు ఇంతటి ఆదరణ లభించడం విశేషమే కదా! ఇటువంటి నంబర్స్ రావడం సూపర్ సక్సెస్ అని చెప్పాలి. 

4

సినిమాలో ఒకే ఒక్క క్యారెక్టర్ ఉన్నప్పటికీ... దర్శకుడు ప్రశాంత్ కథను నడిపించిన తీరు పట్ల ప్రేక్షకులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో విఫలమై ఆర్జేగా పని చేస్తున్న నిలయ్ (సుమంత్) రేడియో స్టేషనులో ఉండగా... రాత్రి వేళ ఒక అమ్మాయి నుంచి ఫోన్ వస్తుంది. తానొక ఆపదలో ఉన్నానని, తనను కాపాడమమని అడుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా. ఆహా ఓటీటీలో చూడాలి.

5

కథను ఉత్కంఠగా నడపడంలో దర్శకుడు ప్రశాంత్ అట్లూరి సక్సెస్ అవ్వగా... న్యూ ఏజ్ సినిమా నిర్మించినందుకు తనను అప్రిషియేట్ చేస్తున్నారని నిర్మాత రఘువీర్ సంతోషం వ్యక్తం చేశారు.

6

'అహం రీబూట్' సినిమా చిత్రీకరణలో ఉండగా... విజయేంద్ర ప్రసాద్ వచ్చారు. ఇది అప్పటి స్టిల్. ఇందులో స్క్రీన్ ప్లేకి పేరు వచ్చింది. 

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • Aham Reboot: ఆహాలో 'అహం రీబూట్'కి సూపర్ రెస్పాన్స్ - 20 రోజుల్లో రెండు కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.