Niharika Konidela : ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానంటూ హాయిగా నవ్వేస్తున్న మెగా డాటర్
నిహారిక కొణిదెల హాఫ్ శారీలో ఫోటోషూట్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు It was a happy day ❤️అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/niharikakonidela)
గ్రీన్, రెడ్ కలర్ మిక్స్ ఉన్న కలంకారీ హాఫ్ శారీలో.. దానికి తగ్గట్టు రెడ్ బ్లౌజ్ వేసుకుని.. మెడలో చౌకర్ పెట్టుకుని అందంగా ముస్తాబైంది నిహారిక. జుట్టును ముడి వేసి.. కొప్పులో పూలు పెట్టుకుని.. ముసి ముసి నవ్వులతో ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/niharikakonidela)
మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా పరిచమైన ఏకైక అమ్మాయి నిహారిక. డైరక్ట్ హీరోయిన్గా రాకుండా ముందుగా పలు షోలకు వ్యాఖ్యాతగా చేసింది. అనంతరం షార్ట్ ఫిల్మ్స్ చేసి తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.(Images Source : Instagram/niharikakonidela)
పలు సినిమాల్లో నటించి నటిగా మంచి మార్కులే కొట్టేసింది కానీ.. సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయింది. త్వరలోనే మరో తమిళ సినిమాతో థియేటర్లలోకి అడుగు పెడుతున్నట్లు వెల్లడించింది.(Images Source : Instagram/niharikakonidela)
నిహారికాకు ఏనుగులంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటితో కలిసి చిన్న పిల్లలాగా ఆడుకుంటుంది. తన ప్రొడెక్షన్ పేరు కూడా పింక్ ఎలిఫెంట్ అని పెట్టి తన ప్రేమను చాటుకుంది.(Images Source : Instagram/niharikakonidela)
డివోర్స్ తర్వాత తన కెరీర్‌పై మరింత కాన్సంట్రేట్ చేసినట్లు ఈ భామ చెప్తోంది. అటు ప్రొడ్యూసర్‌గా, నటిగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నిహా.(Images Source : Instagram/niharikakonidela)