Neha Shetty Traditional Look: చమ్కీల చీరలో మెరిపోతున్న 'డీజే టిల్లు' నేహా శెట్టి - ఇదేం చీరకట్టు రాధిక
Neha Shetty Traditional Look: 'డీజే టిల్లు' కంటే ముందు నేహా శెట్టి తెలుగులో పలు సినిమాలు చేసింది. ఆమెను గుర్తింపు ఇచ్చింది మాత్రం 'డిజే టిల్లు'నే. ఇందులో ఆమె చేసిన రాధిక పాత్రతో సెన్సేషన్ అయ్యింది.
రాత్రికిరాత్రే స్టార్‌డమ్ తెచ్చింది. ఈ సినిమాలో ఆమెకు వచ్చిన పాపులారిటీతో ఇక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అవుతుందనున్నారు.
ఇక వరుస ఆఫర్స్‌తో బిజీ అవుతుందనుకుంటే అందుకు భిన్నంగా ఆమె కెరీర్ సాగుతుంది. డీజే టిల్లు వచ్చి రెండేళ్లు అవుతుంది. కానీ ఈ చిత్రం తర్వాత ఆమె నటించింది మూడు సినిమాలే.
'బెదురులంక 2012', 'రూల్స్ రంజన్', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఇందులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కావాల్సి ఉండగా ఆ ముందు సినిమాలు ఆమెకు ఆశించిన విజయం ఇవ్వలేకపోయాయి.
మరోవైపు సోషల్ మీడియాలోనూ తన లేటెస్ట్ లుక్, గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ ట్రెడీషనల్ లుక్‌లో కట్టిపడేసింది. క్రీం అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్‌లో చమ్కీల చీరకట్టి ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నెహా శెట్టి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.