Neha Shetty in Red Suit: రెడ్ సూట్‌లో నేహా శెట్టి అందాల విందు - 'రాధిక' లుక్స్‌కి ఫిదా అవుతున్న నెటిజన్లు
Neha Shetty Photos:ఈ మధ్య నేహా శెట్టి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది.
ట్రెడిషనల్, ట్రెండీ వేర్‌లో కుర్రకారు మనసులు దోచేస్తుంది. తాజాగా ఈబ్యూటీ రెడ్ కలర్ సూట్‌లో మెస్మరైజ్ చేసింది. 'జస్ట్ రెడ్ ఒబెస్డ్' అంటూ తన ఫోటోలను పంచుకుంది.
ఇందులో రెడ్ హార్ట్‌లో నేహ శెట్టి మెరిసిపోయింది. కాగా నేహా శెట్టి డీజే టిల్లుతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. అంతకు ముందు ఎన్నో సినిమాల్లో చేసిన 'డీజే టిల్లు' రాధిక పాత్రతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.
ఎంతగా అంటే ఈ మూవీ వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ రాధిక, రాధిక అంటూ యువత ఈ పేరును కలవరిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్‌లోనూ కాసేపు మెరిసింది ఈ బ్యూటీ.
ఇదిలా ఉంటే యంగ్ హీరో విశ్వక్ సేన్ జతగా నేహా నటించిన'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. దీనితో పాటు ఆమె మరిన్ని సినిమాలతో బిజీగా ఉంది.