Mrunal Thakur : ఇప్పుడు తన మూడ్ ఫిల్మ్స్ మీద లేదంటున్న మృణాల్ ఠాకూర్
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అనార్కలీ డ్రెస్‌లో లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. ఫుల్ లెంగ్త్ హ్యాండ్స్, నెలవరకు తాకే డ్రెస్‌లో చున్నీ వేసుకుని ఈ ఫోటోషూట్ చేసింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Images Source : Instagram/mrunalthakur )
ఈ ఫోటోషూట్ కోసం కర్ల్స్ చేసి హెయిర్ లీవ్ చేసింది. మినిమల్ మేకప్‌తో బుగ్గలకు పింక్ బ్లష్ వేసి.. ఐలైనర్ పెట్టి రెడ్ లిప్ స్టిక్‌తో తన అందానికి మెరుగులుదిద్దింది ఈ భామ.(Images Source : Instagram/mrunalthakur )
ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకుంది మృణాల్. Filmy nahi फूल-my mood 📽️🌸 అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ పెట్టింది. ఫ్యాన్స్ కూడా ఆమెకు పువ్వుల ఎమోజీలు పెడుతూ చాలా బాగున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Images Source : Instagram/mrunalthakur )
2012 నుంచి తన కెరీర్ ప్రారంభించింది మృణాల్ హిందీలో పలు సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అలా హిందీ నుంచి తెలుగు డబ్ అయిన కుంకుమ భాగ్యలో బుల్బుల్ అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. అదొక డబ్ సీరియల్గానే వచ్చింది కాబట్టి హిందీ నటిగానే ప్రేక్షకులు చూశారు. అనంతరం బాలీవుడ్లో పలు సినిమాల్లో చేసింది.(Images Source : Instagram/mrunalthakur )
సూపర్ 30లో హృతిక్ సరసన చేసింది. లవ్ సోనియా, ఘోస్ట్ స్టోరీస్ వంటి సినిమాలు ఆమెకు గుర్తింపును తెచ్చాయి. అయితే హీరోయిన్గా పూర్తి సక్సెస్ కాలేదు. ఆ సమయంలో ఆమెకు తెలుగు నుంచి ఓ మంచి క్రేజీ ఆఫర్ వచ్చింది. అదే సీతారామం.(Images Source : Instagram/mrunalthakur )
దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్గా సీత పాత్రలో మృణాల్ నటించి ఎందరో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో సౌత్‌లో ఆమె పేరు మార్మోమ్రోగిపోయింది. తాజాగా హాయ్ నాన్నలో నాని తరపున హీరోయిన్గా నటించింది మెప్పించింది ఈ సుందరి.(Images Source : Instagram/mrunalthakur )