Hansika Motwani : లంగా ఓణిలో హన్సిక.. క్యూట్‌గా ఫోజులిచ్చిన హీరోయిన్
హన్సిక మోత్వానీ తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొంది. వైట్, పాస్టెల్ కలర్ మిక్స్‌లో ఉన్న ఔట్ఫిట్లో కనిపించింది. ఈ సందర్భంగా ఆమె ఫోటోషూట్ చేసింది. క్యూట్ ఫోజులిస్తూ ఫోటోలు దిగింది.(Image Source : Instagram/ihansika)
నెట్ లుక్‌లో వచ్చిన ఓణి ధరించి.. దానికి డిజైనర్ బ్లౌజ్‌ని జత చేసింది హన్సిక. హెయిర్‌ను సెమీ కర్ల్స్ చేసి.. ముందుకు వేసుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఎక్కువ జ్యూవెలరీ ధరించకుండా కేవలం డైమండ్ చౌకర్ పెట్టుకుని తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Image Source : Instagram/ihansika)
మినిమల్ మేకప్.. న్యూడ్ షేడ్, పింక్ బ్లష్‌తో.. బ్రౌన్ కలర్ మస్కారాతో తన మేకప్ లుక్ సెట్ చేసుకుంది. పింక్ మ్యాట్ లిప్ స్టిక్, చేతులకు ఎర్రని నెయిల్ పాలిష్ వేసుకుని హన్సిక ఈ ఫోటోషూట్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. (Image Source : Instagram/ihansika)
హన్సీక బాల నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలో టెలీకాస్ట్ అయిన బూమ్‌బూమ్ షక లక అనే సీరియల్ చేసింది. ఈ సీరియల్ తెలుగులో కూడా డబ్ చేశారు. అంతకముందు పలు బాలీవుడ్ సినిమాల్లో బాలనటిగా చేసింది. బూమ్ బూమ్ షకలక తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుంది.(Image Source : Instagram/ihansika)
అప్పటివరకు బాలనటిగా చేసి గ్యాప్ తీసుకున్న హన్సిక ఎవరూ ఊహించని విధంగా పూరిజగన్నాథ్ దర్శకుడిగా, అల్లుఅర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే సన్యాసిగా నటించి.. ఏ హీరోయిన్ చేయని రోల్ ప్లే చేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.(Image Source : Instagram/ihansika)
తర్వాత పలు సినిమాల్లో నటించి అభిమానులను ఆకట్టుకుంది. దాదాపు ఆమె నటించిన ఆమె అన్ని సినిమాలు మంచి టాక్‌ను సంపాదించుకున్నాయి. తన నటన, అందంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది హన్సిక. తెలుగు, తమిళం సినిమాలో ఫుల్ బిజీ అయిపోంది ఈ భామ. (Image Source : Instagram/ihansika)
ప్రస్తుతం సినిమాలు, సిరీస్‌లు అనే తేడా లేకుండా బిజీగా ఉంటుంది. తాజాగా తెలుగులో కూడా నా పేరు శ్వేత అనే సినిమాను ఓటీటీ వేదికగా రిలీజ్ చేసింది. ప్రస్తుతం పలు సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. (Image Source : Instagram/ihansika)