Mehreen Pirzada : చూపుతిప్పుకొనివని పంజాబ్ బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్ షేర్ చేసిన మెహ్రీన్ పిర్జాదా
చిన్నప్పుడే మోడలింగ్ మొదలెట్టిన మెహ్రీన్ చాలా ప్రకటనలలో నటించింది. టాలీవుడ్ లో నాని హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో అడుగుపెట్టింది. అందులో నటన, అందంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.
రవితేజ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ మూవీ మెహ్రీన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు'లో నటించింది. ఇది కూడా సూపర్ హిట్టైంది.
రాజా ది గ్రేట్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మళ్లీ మళ్లీ నటించే ఛాన్స్ దక్కించుకుంది... F2, F3 లో హీరోయిన్ గా ఛాన్సందుకుంది. వీటిలో F2 సూపర్ హిట్టైంది..F3 పర్వాలేదు అనిపించుకుంది.
పెళ్లి విషయంలో కూడా మెహ్రీన్ కొన్ని సమస్యలు ఎదుర్కొంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత మళ్లీ మూవీస్ లో బిజీ అయింది. మంచి అవకాశాలకోసం ఎదురుచూస్తోన్న మెహ్రీన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది...
మెహ్రీన్ పిర్జాదా (Image Credit:Mehreen Pirzada/Instagram)
మెహ్రీన్ పిర్జాదా (Image Credit:Mehreen Pirzada/Instagram)