Ramesh Babu: అన్నయ్య అంటే మహేష్ కి ప్రాణం.. కానీ ఇప్పుడేమో..
సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు శనివారం రాత్రి ఆరోగ్య సమస్యలతో మరణించారు. లివర్ సంబంధిత వ్యాధితో ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది.
బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, కృష్ణ గారి అబ్బాయి సహా పలు సినిమాల్లో ఆయన హీరోగా నటించారు. అయితే ఇండస్ట్రీలో కథానాయకుడిగా మాత్రం రాణించలేకపోయారు.
చిన్నప్పటి నుంచి రమేష్ బాబుకి, మహేష్ బాబుకి మధ్య మంచి బాండింగ్ ఉండేది.
కృష్ణ గారు ఎక్కువగా సినిమాలతో బిజీగా ఉండడంతో తమ్ముడికి సంబంధించిన అన్ని పనులు రమేష్ బాబే చూసుకునేవారు.
అందుకే మహేష్ కి తన తండ్రి కంటే రమేష్ బాబు అంటే భయం ఉండేది.
అలానే అన్నయ్యపై చెప్పలేనంత ప్రేమ కూడా ఉండేది. ఒకసారి రమేష్ బాబుకి జ్వరం వచ్చిందని తల్లడిల్లిపోయారు మహేష్.
అలాంటి వ్యక్తి ఇప్పుడు కన్నుమూశారనే విషయాన్ని మహేష్ తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మహేష్ కరోనా కారణంగా ఐసొలేషన్ లో ఉన్నారు. చివరిచూపుకైనా వచ్చే పరిస్థితి లేదు. మరేం చేస్తారో..?