Mahesh Babu Birthday: బర్త్ డే కోసం మహేష్ విష్.. ఫ్యాన్స్ తీరుస్తారా..?

బర్త్ డే కోసం మహేష్ విష్
సూపర్ స్టార్ మహేష్ బాబుకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇప్పుడు సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకరిగా మారారు.
సినిమాలు, ఫ్యామిలీ తప్ప మహేష్ బయట ఎక్కడా పెద్దగా కనిపించరు. తనకు సమయం దొరికితే పిల్లలతో సమయం గడపడానికి చూస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ కి కోట్ల మంది అభిమానులు ఉన్నారు.
ఈ స్టార్ హీరో ఆగస్టు 9న పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. దీంతో ఫ్యాన్స్ ఇప్పటినుండే హడావిడి మొదలుపెట్టేశారు. అయితే ఈసారి తన పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు తన అభిమానులను ఓ కోరిక కోరాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు.
పొల్యూషన్ ను అరికట్టడానికి మనవంతు బాధ్యతగా మొక్కలు నాటాలని.. తన పుట్టినరోజు నాడు కోరుతున్న కోరిక ఇదేనంటూ అభిమానులకు పిలుపునిచ్చాడు. ప్రతి ఒక్కరూ తన పుట్టినరోజు నాడు మూడు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను సపోర్ట్ చేయాలంటూ మహేష్ స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు.
దీనికి సంబంధించిన పోస్ట్ లలో తన ట్యాగ్ చేయమని కోరాడు. మహేష్ ఇంతగా రిక్వెస్ట్ చేసిన తరువాత ఫ్యాన్స్ అతడి కోరికను తీర్చకుండా ఉంటారా..? ఇప్పటినుండే ప్లాంటేషన్ ను మొదలుపెట్టేస్తున్నారు.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో మహేష్ ఎంతో స్టైలిష్ గా కనిపించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు.