Lahari Shari Latest Photos: ఎల్లో శారీలో మెరిసిపోతున్న 'బిగ్‌బాస్' బ్యూటీ లహరి - మంచు కొండల్లో అందాల ఆరబోత
బిగ్‌బాస్ బ్యూటీ లహరి షారీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ రియాలిటీ షోకు ముందు వరకు ఈమె పెద్దగా ఎవరికి తెలియదు. అప్పటికే అర్జున్ రెడ్డి, మళ్లీ రావా వంటి స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది.
అంతేకాదు పలు చిత్రాల్లో జర్నలిస్ట్‌గా, యాంకర్‌గా స్పెషల్ ఎప్పిరియరెన్స్ ఇచ్చింది. అయితే సినిమాలతో రాని గుర్తింపు ఆమెకు బిగ్‌బాస్ ఇచ్చింది. బిగ్‌బాస్ 5 సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆమె తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది.
తన యాటిట్యూడ్‌తో తరచూ గొడవలు పెట్టుకుంటూ హౌజ్‌లో కంటెంట్ ఇచ్చేది. దీనివల్ల ఆమెకు నెగిటివిటీ కూడా పెరిగింది. దాంతో హౌజ్‌లో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చింది.
బయటకు వచ్చిన అనంతరం లహరి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన హాట్‌హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది. అంతేకాదు ట్రావెలింగ్ అంటే లహరి చాలా ఇష్టం.
ఇదే విషయాన్ని ఆమె బిగ్‌బాస్‌లోనూ చెప్పింది. దాంతో తరచూ ఏదోక వెకేషన్‌కు వెళుతూ ఫొటోలను షేర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌లో సందడి చేస్తుంది ఈ బ్యూటీ. అక్కడ మంచు కొండల్లో స్నో ఫాల్‌ను ఆస్వాదిస్తుంది.
ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కశ్మీర్ మంచు కొండల మధ్య ఎల్లో కలర్ చీరలో లహరి యాపిల్ పండులా మెరిసిపోయింది. ప్రస్తుతం ఆమె నెట్టింట వైరల్‌గా మారింది.
పలుచని చీరలో స్లీవ్‌లెస్ బౌజ్‌లో లహరి అందాలు ఆరబోత చూసి కుర్రకారు ఫిదా అవుతుంది. హాట్ అందాలతో వింటర్‌లోనూ సెగలు పుట్టిస్తున్నావ్ అంటూ ఆమె ఫొటోలకు కామెంట్స్ చేస్తున్నారు.
బిగ్‌బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లహరి మోడల్‌గా, న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించింది. అలాగే సినిమాల్లో ఆఫర్స్ అందుకుంది. అలా అర్జున్ రెడ్డి మళ్లీ రావా, పటేల్ సార్, అజ్ఞాతవాసి, పేపర్ బాయ్, శ్రీనివాస కల్యాణం, తిప్పరా మీసం, జాంబీ రెడ్డి వంటి పెద్ద సినిమాల్లో నటించింది.