Krithi Shetty: కృతి శెట్టి కూల్ లుక్ - కొంటెచూపుతో మనసులు దోచేస్తున్న 'బేబమ్మ'
Krithi Shetty Photos: తొలి సినిమాతోనే ఎనలేని స్టార్‌డమ్ తెచ్చుకుంది కృతి శెట్టి. ఉప్పెనతో లైమ్ లైట్లోకి వచ్చింది.
ఈ సినిమాతోనే టాలీవుడ్ ఆరంగేట్రం చేసిన ఆమెకు స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. డెబ్యూ చిత్రంతోనే వందకోట్ల వసూళ్లు సాధించింది.
'ఉప్పెన' బేబమ్మ పాత్రలో ఆకట్టున్న కృతికి ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి. బ్యాక్ టూ బ్యాక్ మూడు సినిమాలు చేస్తూ హ్యాట్రిక్ హిట్ కొట్టింది.
దీంతో లక్కీ లెగ్ అని పేరుతెచ్చుకున్న ఈ భామ అదే జోరు కొనసాగించలేకపోయింది. ఆ తర్వాత ఆమెను వరుస ప్లాప్స్ వెంటాడాయి.
దాంతో ఇప్పుడు బేబమ్మకు ఇప్పుడు ఆఫర్స్ కరువయ్యాయి. కేరీర్ ప్రారంభంలో చేతిలో అరడజన్ సినిమాలు పెట్టుకున్న ఆమెకు ఇప్పుడు ఒకటిరెండు మాత్రమే ఉన్నాయి. అవి కూడా చాలా కష్టంగా వచ్చిన ఆఫర్స్.
ప్రస్తుతం వెండితెరపై ఈ బ్యూటీ సందడి కరువైనా.. సోషల్ మీడియాలో మాత్రం తరచూ ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ క్రీం కలర్ డ్రెస్‌లో మెరిసింది. కూల్‌గా కనిపిస్తూనే హాట్ ఫోజులతో కుర్రకారును ఫిదా చేసింది. ప్రస్తుతం కృతి శెట్టి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.