kasturi Serial Aishwarya Pisse Photos: నిజంగా డాక్టర్ అవబోయి యాక్టర్ అయ్యానంటున్న ' కస్తూరి' సీరియల్ నటి ఐశ్వర్య
అగ్నిసాక్షి సీరియల్ లో గౌరీగా ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్న అందమైన అమ్మాయి ఇప్పుడు కస్తూరి సీరియల్ తో మురిపిస్తోంది. ఆమె పేరు ఐశ్వర్య పిస్సే.
బెంగళూరులో పుట్టి పెరిగింది ఐశ్వర్య. చిన్నప్పుడే తండ్రి వదిలేసి తల్లిని వదిలేసి వెళ్లిపోయాడు. ఐశ్వర్య వాళ్ల అమ్మ హెల్త్ వర్కర్‌గా పని చేసేది. అందుకే ఆయుర్వేదం డాక్టర్ కావాలని కలలు కన్నది. కానీ అమ్మ పడే కష్టం అర్థమై చదువుకి స్వస్తి చెప్పి పదో తరగతిలో ఉన్నప్పుడే నటనపై ఆసక్తి పెంచుకుంది. ఆడిషన్లకు వెళ్లి మెప్పించిన ఐశ్వర్య ప్రస్తుతం పలు సీరియల్స్ తో మెప్పిస్తోంది.
కన్నడలో మొదట రెండు సీరియల్స్‌లో చిన్న పాత్రలు చేసిన ఐశ్వర్య ఆ తర్వాత మెయిన్ లీడ్ చేసింది. ఓ వైపు నటన కొనసాగిస్తూనే డిగ్రీ పూర్తిచేసింది. రెండు సినిమాల్లో కూడా చిన్న పాత్రలు చేసింది. కానీ సీరియల్స్ లో వరుస అవకాశాలు రావడంతో సినిమా ఛాన్సులు పక్కన పెట్టేసింది.
అగ్నిసాక్షి సీరియల్ తో గౌరిగా తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టిన ఐశ్వర్య..ఆరంభంలో ఇంగ్లీష్ లో డైలాగ్స్ రాసుకుని చెప్పేదట. ఇప్పుడైతే తెలుగు చక్కగా మాట్లాడేస్తోంది. ఇప్పుడు కస్తూరి సీరియల్ లో లీడ్ క్యారెక్టర్ చేస్తోంది.
బుల్లితెర నటి నవ్యస్వామి అన్నయ్యనే ఐశ్వర్య పెళ్లిచేసుకుంది. ఇద్దరం వదిన, ఆడపడుచులు కాకుండా ఫ్రెండ్స్‌లా ఉంటాం అంటుంది. పెళ్లి తర్వాత కూడా పర్సనల్ లైఫ్, కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకుపోతోంది ఐశ్వర్య.
కస్తూరి సీరియల్ ఫేమ్ ఐశ్వర్య పిస్సె ఫోటోస్ (Image Credit: Aishwarya Pisse / Instagram)
కస్తూరి సీరియల్ ఫేమ్ ఐశ్వర్య పిస్సె ఫోటోస్ (Image Credit: Aishwarya Pisse / Instagram)
బెస్ట్ ఇరిటేటర్ అంటూ తమ్ముడితో ఉన్న ఫొటోస్ షేర్ చేసిన కస్తూరి సీరియల్ ఫేమ్ ఐశ్వర్య పిస్సె (Image Credit: Aishwarya Pisse / Instagram)