Karthika Deepam Sowjanya: మరో మోనిత అనుకుంటే మెరుపుతీగలా మాయమైన చారుశీల
కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ చారుశీలగా నటిస్తోన్న ఈమె అసలు పేరు సౌజన్య
కార్తీక్-దీపను విడగొట్టేందుకు మోనిత మనిషిగా ఎంట్రీ ఇచ్చిన చారుశీల.. ఆ తర్వాత కార్తీక్ ను సొంతం చేసుకుని ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేసింది. కానీ జైలు నుంచి మోనిత రీ ఎంట్రీతో సైలెంట్ అయిపోయింది.
వాస్తవానికి ప్రస్తుతం నడుస్తున్న ఎపిసోడ్స్ లో అందమైన విలన్ గా చారుశీల కనిపించింది కొద్దిరోజులే అయినా మంచి మార్కులే కొట్టేసింది. మోనితగా శోభాశెట్టికి వచ్చినంత పేరు ఈమె కూడా సొంతం చేసుకుంటుంది అనుకున్నారంతా. కానీ సీరియల్ కి త్వరలో ఎండ్ కార్డ్ పడనుండడంతో పాతవాళ్లందర్నీ మళ్లీ పట్టాలెక్కిస్తున్నారు.
కార్తీకదీపంలో డాక్టర్ చారుశీలగా నటిస్తోన్న ఈమె అసలు పేరు సౌజన్య. మొగలిరేకులు సీరియల్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్న శిరీషకు అక్క సౌజన్య. వీరి స్వస్థలం తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల.
కార్తీకదీపం చారుశీల (సౌజన్య) (image credit: Sowjanya/Instagram)
కార్తీకదీపం చారుశీల (సౌజన్య) (image credit: Sowjanya/Instagram)
కార్తీకదీపం చారుశీల (సౌజన్య) (image credit: Sowjanya/Instagram)
కార్తీకదీపం చారుశీల (సౌజన్య) (image credit: Sowjanya/Instagram)