Janhvi Kapoor : వైట్ శారీలో జాన్వీ కపూర్.. దేవర తమిళ్ ప్రెస్మీట్లో ఏంజిల్‌ని తలపించిన బ్యూటీ
జాన్వీ కపూర్ లుక్స్ దేవర ప్రమోషన్స్‌లో చాలా అట్రాక్టివ్‌గా ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రతి డ్రెస్ కూడా జగదేకవీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి కట్టిన డ్రెస్‌లను తలపిస్తున్నాయి. (Images Source : Instagram/Tamil Press Meet)
తాజాగా జరిగిన తమిళ్ ప్రెస్‌మీట్‌కి జాన్వీ వైట్ శారీలో హాజరైంది. తమిళ్లో క్యూట్‌గా మాట్లాడేస్తూ స్పీచ్ కూడా ఇచ్చింది బ్యూటీ. (Images Source : Instagram/Tamil Press Meet)
శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ జాన్వీ ఎమోషనల్ స్వీచ్ ఇచ్చింది. తమిళ ఫ్యాన్స్ కూడా ఈమెను తంగమే అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. (Images Source : Instagram/Tamil Press Meet)
ఈ ఈవెంట్ కోసం వైట్ శారీలో.. దానికి మ్యాచింగ్ డిజైనర్ బ్లౌజ్ ధరించి.. చెవులకు ముత్యాలతో చేసి ఇయర్ రింగ్స్ పెట్టుకుని క్యూట్ హెయిర్ స్టైయిల్‌తో మెరిసే మేకప్ లుక్‌లో అందంగా కనిపించింది జాన్వీ. (Images Source : Instagram/Tamil Press Meet)
కొరటాల శివ దర్శకత్వంలో.. అనిరుధ్ దేవర చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జత జాన్వీ ఈ సినిమాలో చేశారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనానలను పెంచేశాయి. (Images Source : Instagram/Tamil Press Meet)
తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా కోసం యూత్ మాత్రమే కాదు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి తెలుగులో హిట్ కాంబినేషన్. జూనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వీ కలిసి నటించిన సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. (Images Source : Instagram/Tamil Press Meet)