Janhvi Kapoor : వయ్యారం ఓణి కట్టింది, కానీ ఈవెంట్ క్యాన్సిల్ అయింది.. తెలుగులో క్యూట్ మెసేజ్ ఇచ్చిన జాన్వీ కపూర్
దేవర బ్యూటీ, అతిలోక సుందరి కుమార్తె జాన్వీకపూర్ తెలుగు ప్రేక్షకులతో మాట్లాడాల్సిన సమయం వచ్చింది కానీ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయితే ఫ్యాన్స్ కోసం ఇప్పటికే జూనీయర్ ఎన్టీఆర్ ఓ వీడియో చేయగా.. జాన్వీ కూడా తెలుగులో క్యూట్‌గా మాట్లాడుతూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
మీ అందరినీ కలవాలి అనుకున్నాను. కానీ ఈసారి కుదరడం లేదు. కచ్చితంగా మళ్లీ మిమ్మల్ని కలుస్తాను. జాన్వీ పాప అంటూ నన్ను ముందుగా పిలుస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు థ్యాంక్యూ అంటూ క్యూట్ క్యూట్‌గా తెలుగులో మాట్లాడేసి వీడియో షేర్ చేసింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
అయితే ఈవెంట్ కోసం అందంగా లంగా ఓణిలో ముస్తాబైంది జాన్వీ కపూర్. కానీ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో దానికి సంబంధించిన ఫోటోలను మాత్రం ఇన్‌స్టాలో బ్యూటీఫుల్ క్యాప్షన్‌తో షేర్ చేసింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
నేను ఈ మాటలు స్వయంగా మీతో చెబ్ధామనుకున్నాను. కానీ ఈ సారికి అలా కుదరలేదు. మిమ్మల్నందరినీ త్వరలోనే కలుస్తాననుకుంటున్న. ప్రస్తుతానికి ఇది నా నుండి మీకు ఈ చిన్న మెసేజ్…. See you in theatres on 27th of September #Devara 🌊 అంటూ తెలుగులో క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జాన్వీపాప ఎంత క్యూట్ మాట్లాడిందోనంటూ నెటిజన్లు షేర్ చేస్తున్నారు. దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.(Images Source : Instagram/Janhvi Kapoor)