Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ఇంటి నుంచి పారిపోయి ఇండస్ట్రీకి.. ఇప్పుడు ఏకంగా ఎంపీ - కంగనా రనౌత్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎంపీగా ఎన్నికైంది. హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసింది. తన ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్ పై 74 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. Photo Credit: Kangana Ranaut/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎంపీగా గెలిచిన తర్వాత మండిలో జరిగిన విజయోత్సవాల్లో కంగనా పాల్గొన్నది. ఈ సందర్భంగా తనను గెలిపించిన మండి ప్రజలకు ధన్యవాదాలు చెప్పింది. ప్రధాని మోదీ, బీజేపీపై నమ్మకాన్ని ఉంచి ఈ విజయాన్ని అందించారని వెల్లడించింది. ఇది సనాతన విజయం అంటూ అభిప్రాయపడింది. Photo Credit: Kangana Ranaut/Instagram
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతున్న కంగనా, జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నది. సినిమాల కోసం ఇంటి నుంచి పారిపోయి ఇండస్ట్రీలో చేరింది. డాక్టర్ కావాలనే కోరిక ఉన్నా, చివరకు యాక్టర్ గా మారింది. Photo Credit: Kangana Ranaut/Instagram
ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అవసరాలకు సరిపడ డబ్బు సంపాదించుకునేందుకు మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. కానీ, ఆమె అక్కడ పెద్దగా రాణించలేకపోయింది. మోడల్ జీవితానికి స్వస్తి పలికింది. Photo Credit: Kangana Ranaut/Instagram
మోడలింగ్ లో ఉన్న సమయంలోనే కంగనా ‘గ్యాంగ్ స్టర్‘ అనే సినిమా ఆడిషన్స్ కు వెళ్లి సెలెక్ట్ అయ్యింది. తొలి సినిమాలోనే అద్భుత నటనతో బెస్ట్ డెబ్యూ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు దక్కించుకుంది. Photo Credit: Kangana Ranaut/Instagram
ఆ తర్వాత ‘క్వీన్‘, ‘తను వెడ్స్ మను రిటర్న్స్‘, ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ‘ చిత్రాలతో అద్భుత విజయాలను అందుకుంది. ఈ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. Photo Credit: Kangana Ranaut/Instagram
కంగనా రనౌత్ తన అద్భుత నటనతో ఎన్నో అవార్డులను అందుకుంది. 2009లో ‘ఫ్యాషన్‘ చిత్రంలో నటనకు గానూ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది. 2015, 2016లో ‘క్వీన్‘, ‘తను వెడ్స్ మను రిటర్న్స్‘ చిత్రాలకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డులను అందుకుంది. ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ‘లో నటనకు గాను నాలుగోసారి జాతీయ అవార్డును అందుకుంది. Photo Credit: Kangana Ranaut/Instagram
బాలీవుడ్ లో నెపోటిజంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా కంగనా బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. బాలీవుడ్ కొంత మంది కబంద హస్తాల్లో ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అటు మహారాష్ట్ర ఉద్దవ్ థాక్రే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి సెన్సేషనల్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీ ఐడియాలజీకి దగ్గరై, ఇప్పుడు అదే పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించింది. Photo Credit: Kangana Ranaut/Instagram