Shanmukh Deepthi Love: షన్ను, దీపు నాడు-నేడు: అలా కలిశారు, ఇలా విడిపోయారు.. అరే ఏంట్రా ఇదీ!
దీప్తి సునయన, షన్ముఖ్ జస్వంత్.. ‘బిగ్ బాస్’ వచ్చేవరకు వీరి పేర్లు కేవలం కొద్దిమందికి మాత్రమే తెలుసు. అయితే, ‘బిగ్ బాస్’ తర్వాత వీరిద్దరి గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది. యూట్యూబ్ వీడియోలతో పాపులరైన ఈ జంటకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. షన్ను యూట్యూబ్ వెబ్‌సీరిస్‌లతో.. దీప్తి కవర్ సాంగ్స్‌తో పాపులరైంది. షన్ను కూడా ఆమెతో కలిసి కొన్ని కవర్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్‌లో ఆడిపాడాడు. అలా వారిద్దరూ ప్రేమలో పడ్డారు. వారి చేతిపై లవ్ సింబల్ టాటూస్ కూడా వేయించుకున్నారు. ఎప్పటికీ కలిసుండాలని ప్రమాణం చేసుకున్నారు. కానీ, ‘బిగ్ బాస్’ వారి ప్రేమకథలో విలన్ అయ్యాడు. ‘సిరి’ రూపంలో షన్నుకు బ్యాడ్‌లక్ ‘హగ్’ ఇచ్చింది. దాని వల్ల అతడు ‘బిగ్ బాస్’ టైటిల్ మాత్రమే కాదు.. ఐదేళ్ల ‘ప్రేమ’ను కూడా కోల్పోయాడు. మరి, వీరి తొలి పరిచయం ఎలా జరిగింది? ఎప్పుడు.. ఎలా కలుసుకున్నారు? వారి బ్రేకప్‌కు కారణం ఏమిటీ? - Image Credit: Shanmukh Jaswanth/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appషన్ముఖ్ జస్వంత్ విశాఖపట్నంలో పుట్టాడు. అక్కడే గీతమ్ యూనివర్శిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో నిలదొక్కుకున్న హాస్య నటుడు వైవా హర్షాకు షన్ముఖ్ బంధువు (కజిన్). వీరిద్దరు కలిసి కొన్ని యూట్యూబ్ వీడియోలు కూడా చేశారు. గీతమ్‌లో ఉన్నప్పుడు షన్ముఖ్ ఫ్లాష్ మోబ్ డ్యాన్స్‌లు చేస్తుండేవాడు. - Image Credit: Shanmukh Jaswanth/Instagram
2013లో ‘ది వైవా’ అనే యూట్యూబ్ వీడియోలో షన్ను ద్విపాత్రభినయం చేశాడు. ఆ తర్వాత కొన్ని షార్ట్, కామెడీ వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యారు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన దీప్తి సునయన రెడ్డి ‘డబ్ స్మాష్’ వీడియాలతో ఆకట్టుకునేది. - Image Credit: Shanmukh Jaswanth/Instagram
2017లో ఖుషీ వీడియో సాంగ్ బాగా వైరల్ అయ్యింది. అంతకు ముందే.. దీప్తి సునయన డబ్‌స్మాష్ వీడియోలు చూసి ఫిదా అయ్యాడు షన్ను. 2016లోనే ఆమెను కలిశాడు. ఆమెతో కలిసి తీయించుకున్న మొదటి ఫొటో ఇదే. - Image Credit: Shanmukh Jaswanth/Instagram
ఆ తర్వాత ఇద్దరు కలిసి డబ్ స్మాష్‌లు చేశారు. ఆ తర్వాత ‘గువ్వ గోరింకతో’ పాటతో యూట్యూబ్‌లో మెరిశారు. 2017 సంవత్సరం వీరిద్దరి జీవితాన్ని ‘మలుపు’ తిప్పింది. షన్ను యూట్యూబ్ సీరిస్‌కు మంచి ఆధరణ లభించింది. మరోవైపు దీప్తి సునయన కవర్ సాంగ్స్‌తో పాపులారిటీ సంపాదించింది. సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేసింది. చివరికి 2018లో ‘బిగ్ బాస్-2’లో ఛాన్స్ కొట్టేసింది. - Image Credit: Shanmukh Jaswanth/Instagram
బిగ్ బాస్ సీజన్-2లో నటుడు, హౌస్‌మేట్ తనీష్‌తో చనువుగా ఉంది. దీంతో ఆమె తనీష్‌ను ప్రేమిస్తోందనే ప్రచారం జరిగింది. దీనివల్ల షన్ను, దీప్తి మధ్య దూరం పెరుగుతుందని, బ్రేకప్ తప్పదని అప్పట్లోనే భావించారు. కానీ, షన్ను-దీప్తిల ప్రేమ కొనసాగింది. కాస్త దూరం పెరిగినట్లు కనిపించినా.. ఆ తర్వాత ఇద్దరు కలిసి కనిపించడంతో అంతా సర్దుకుంది. ఇద్దరు తమ చేతులపై టాటూలు కూడా వేయించుకున్నారు. - Image Credit: Shanmukh Jaswanth/Instagram
2021లో ప్రసారమైన ‘బిగ్ బాస్’ సీజన్-5లో షన్ను ఫెవరెట్ కంటెస్టెంట్‌గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తనకు అప్పటికే పరిచయం ఉన్న సిరితో చనువుగా ఉన్నాడు. సిరి కూడా అతడికి హగ్‌లు ఇస్తూ.. సీజన్ మొత్తం అతడినే అంటిపట్టుకుని ఉంది. షన్ను కూడా ఆమెను కంట్రోల్ చేస్తూ.. హగ్‌ల యుద్ధాన్ని కొనసాగించారు. ఇది వీక్షకులనే కాదు.. దీప్తిని కూడా బాగా హర్ట్ చేసినట్లుంది. - Image Credit: Shanmukh Jaswanth/Instagram
షన్ను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దీప్తి అతడిని కలవలేదు. పైగా వారిద్దరు ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకున్నారు. గత ఆరేళ్లలో వీరి మధ్య ఇంతలా దూరం పెరగలేదు. ‘అన్‌ఫాలో’ అయినప్పుడే.. ఇద్దరికి ‘బ్రేకప్’ తప్పదని భావించారు. - Image Credit: Shanmukh Jaswanth/Instagram
ఊహించినట్లే.. 2021, డిసెంబరు 31న బ్రేకప్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. జనవరి 1, 2022న షన్ను దీనిపై స్పందించాడు. ఆమె నిర్ణయాన్ని స్వాగతించాడు. - Image Credit: Shanmukh Jaswanth/Instagram
పాపం.. ఐదేళ్ల ప్రేమ ఇలా ముగుస్తుందని వారి అభిమానులు కూడా ఊహించలేదు. ఎందుకంటే.. వారికి కూడా ఆ ఇద్దరు కలిసుండటమే ఇష్టం. మరి.. స్పర్థలు తొలగిపోయి భవిష్యత్తులో తిరిగి ఒక్కటవ్వుతారో లేదో చూడాలి. - Image Credit: Shanmukh Jaswanth/Instagram