Happy Birthday Shruti Haasan: ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం..పదేళ్లైనా అదే లుక్ తో మెస్మరైజ్ చేస్తోన్న శ్రుతిహాసన్
కమల్ -సారిక కుమార్తెగా కన్నా శ్రతిహాసన్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. సింగర్, మ్యూజిక్ కంపోజర్, హీరోయిన్ ఇలా మల్టీ టాలెంట్స్ తో కెరీర్లో దూసుకుపోతోన్న శ్రుతి హాసన్ పుట్టినరోజు.
శ్రుతి హాసన్ 2000 సంవత్సరంలో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన “హే రాం” సినిమాతో బాలనటిగా వెండితెరపై మెరిసింది. ఆ తర్వాత మల్టీ టాలెంట్స్ తో మెప్పించిన బ్యూటీ 2008లో “లక్” సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. లక్ పెద్దగా కలసిరాలేదు. 2011లో సిద్దార్థ్ హీరోగా నటించిన “అనగనగా ఓ ధీరుడు” సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.
వరుస ఫ్లాపులతో ఐరెన్ లెగ్ ముద్ర పడింది. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ తో కలసి నటించిన 'గబ్బర్ సింగ్' సినిమా అమ్మడి కెరీర్ ని మలుపు తిప్పింది.
'కాటమరాయుడు' సినిమా తర్వాత కూడా శ్రుతి కెరీర్ కి బ్రేక్ పడిందనుకున్నారు కానీ ' క్రాక్', 'వకీల్ సాబ్' సినిమాలతో రెట్టించిన ఉత్సాహంతో దూసుకొచ్చింది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సరసన తొలిసారి నటిస్తోంది. ప్రభాస్ 'సలార్' లోనూ హీరోయిన్ గా నటిస్తోంది.
నటిగానే కాదు సింగర్ గానూ సత్తాచాటుకుంది. తండ్రి నటించిన‘ఈనాడు’ సినిమాకు ప్రచార గీతంలో గళం విప్పిన శ్రుతి ఆ తర్వాత 'ఓ మై ఫ్రెండ్', 'త్రీ', 'రేసుగుర్రం', 'ఆగడు' సినిమాల్లో పాటలు పాడి అలరించింది. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కు కంపోజర్ గానూ పనిచేసింది.
హ్యాపీ బర్త్ డే శ్రుతిహాసన్ (image credit : Shruti Haasan/Instagram)