✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Hansika Motwani: పెళ్లి తర్వాత కూడా ఏం మారలేదు - అదొక్కటి తప్పా అంటున్న హన్సిక

Sneha Latha   |  21 Feb 2024 05:30 PM (IST)
1

Hansika Motwani Photos: ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే ‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

2

ఆ తర్వాత 'కంత్రీ', ‘మస్కా’, ‘కందిరీగ’ లాంటి సినిమాలతో తెలుగు సినీ అభిమానులకు మరింత చేరువయ్యింది. ఆ తర్వాత కూడా సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌, ఓ మై ఫ్రెండ్‌ వంటి సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ సడెన్‌గా టాలీవుడ్‌కు దూరమైంది.

3

ఇక్కడ ఆమెకు ఆఫర్స్‌ తగ్గడంతో కోలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ వరుస ఆఫర్స్‌, లేడీ ఒరియంటెడ్‌ చిత్రాలు చేస్తూ బిజీ అయిపోయింది.అయితే బొద్దుగా మారి బబ్లీ బ్యూటీ అని పిలుపించుకున్న హన్సిక ఆ తర్వాత సన్నబడిన సంగతి తెలిసిందే.

4

అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ఫుల్‌ గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుంది. పొట్టి బట్టలు, చీరల్లో గ్లామర్‌ డోస్‌ పెంచేసి ఫొటోలకు ఫోజులు ఇస్తుంది. తాజాగా డిజైనర్‌ సీక్వెన్స్‌ గోల్డ్‌ కలర్‌ చీరలో తళుక్కున మెరిసింది.

5

ఇదిలా ఉంటే ఏడాది క్రితం చిన్ననాటి మిత్రుడు సోహైల్‌ కథూరియాతో ఏడడుగులు వేసిన ఆమె పెళ్లి తర్వాత కూడా అదే జోరు చూపిస్తుంది. పెళ్లి చేసుకున్నప్పటికీ నటిగా కొనసాగుతుంది.

6

ఇప్పుడు పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తుంది. ఈ క్రమంలో 105, గార్డియన్‌, మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి చిత్రాలలో నటించింది. మరోవైపు డిజిటల్‌ వరల్డ్‌లో అడుగుపెట్టిది. MY3 మూవీ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

7

ఒకవైపు నటిగా బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్‌ మీడియలో ఫుల్‌ గ్లామర్‌ డోస్‌ పెంచేసింది. తరచూ వెకేషన్స్‌ వెళుతూ పొట్టి బట్టల్లో ఫొటోలు షేర్‌ చేస్తుంది. ఇక ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన హన్సిక తన పెళ్లి ముచ్చట్లు చెప్పుకొచ్చింది.

8

వివాహం తర్వాత తన జీవితంలో ఏం మారలేదంటూ మ్యారీడ్‌ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్‌ చేస్తున్నానని చెప్పకనే చెప్పింది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా నా లైఫ్‌ ఒకేలా ఉంది. నా ఇంటి పేరుతో సహా ఏదీ మారలేదు.

9

ఒక్క అడ్రస్‌ మాత్రమే మారింది అంటూ చెప్పుకొచ్చింది. హన్సిక మోత్వానిగా గుర్తింపు పొందడానికి చాలా కష్టాపడ్డానని, అందువల్లే తన ఇంటి పేరును మార్చుకోలేదని స్పష్టం చేసింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Hansika Motwani: పెళ్లి తర్వాత కూడా ఏం మారలేదు - అదొక్కటి తప్పా అంటున్న హన్సిక
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.