✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rashmika : రష్మిక ముఖాన్ని గుర్తుపెట్టుకుంటారో లేదోనని..!

ABP Desam   |  30 Jun 2021 02:38 PM (IST)
1

చూడచక్కని అందం.. హృదయాలను కట్టిపడేసే క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ రష్మిక సొంతం. అలాంటిది తన ముఖాన్ని ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారో లేదోనని ఆమె టెన్షన్ పడిన రోజులు ఉన్నాయట. జర్నలిజంలో రాణించాలనుకున్న రష్మిక నటన మీద ఆసక్తితో హీరోయిన్ గా మారింది. చిన్నప్పుడే స్కూల్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ అందరి ప్రశంసలు అందుకుంది. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని మోడలింగ్ మొదలుపెట్టింది. 

2

మోడలింగ్ డేస్ లో రష్మిక కొన్ని ఫోటోషూట్ లలో పాల్గొంది. ఆ ఫొటోల్లో రష్మిక ఎంతో ఇన్నోసెంట్ గా, స్టైలిష్ గా కనిపించింది. ఆమె నటించిన కొన్ని యాడ్స్ చూసిన రిషబ్ శెట్టి ఆమెకి నటిగా అవకాశం ఇచ్చాడు. అయితే నటించడానికి వచ్చిన ఆరంభంలో తన ముఖాన్ని ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారో లేదోనని టెన్షన్ పడేదట. ప్రయత్నం చేద్దామని తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఈరోజు తన అందంతో 'నేషనల్ క్రష్' గా మారింది రష్మిక. 

3

కన్నడలో కెరీర్ మొదలుపెట్టినప్పటికీ.. తెలుగునాట తన సత్తా చాటుతోంది. 'ఛలో', 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' ఇలా వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ తో కలిసి 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. ఎన్ని అవకాశాలు వచ్చినా.. ప్రతీ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటుంది రష్మిక. వేగంగా ఎదిగి.. వెంటనే పడిపోకూడదని.. అందుకే కథల విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటానని చెబుతోంది. 

4

తెలుగులో హీరో విజయ్ దేవరకొండతో రష్మికకు స్పెషల్ బాండింగ్ ఉంది. వీరిద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు. అందులో 'గీత గోవిందం' వంద కోట్లు వసూలు చేసింది. సందర్భం వచ్చిన ప్రతీసారి విజయ్ ని తెగ పొగుడుతుంటుంది రష్మిక. ఇండస్ట్రీలో విజయ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని.. అన్నీ షేర్ చేసుకుంటానని చెబుతుంటుంది. 

5

రష్మిక వేలికి ఓ ఉంగరం ఉంటుంది. చాలా సినిమాల్లో కూడా అది పెట్టుకొనే కనిపించింది. ఆ రింగ్ ప్రత్యేకత ఏంటని గతంలో ఆమెని ప్రశ్నిస్తే.. అది తన అభిమానుల నుండి గిఫ్ట్ గా వచ్చిందని.. చాలా స్పెషల్ గా చూసుకుంటానని.. ఎప్పుడూ తనతోనే ఉంటుందని చెప్పింది. 

6

సౌత్ హీరోయిన్లు చాలా మందికి బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని కోరిక. అయితే రష్మికకు చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయి. సిద్దార్థ్‌ మల్హోత్రతో 'మిషన్‌ మజ్ను' అలానే అమితాబ్ బచ్చన్ తో 'గుడ్ బై' సినిమాల్లో నటిస్తోంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Rashmika : రష్మిక ముఖాన్ని గుర్తుపెట్టుకుంటారో లేదోనని..!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.