Ennenno Janmala Bandham Serial Debjani Modak Photos: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తోన్న బెంగాలీ అందం
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది బెంగాలీ బ్యూటీ దేబ్‌జాని మోదక్. కోల్ కతా స్కూల్ లో టెన్త్ చదువుతుండగా మ్యాథ్స్ ట్యూషన్ కి వెళ్లేదట. ఓ రోజు ట్యూషన్ నుంచి ఇంటికివెళుతుండగా ఓ ఆవిడ ఎదురై సీరియల్ లో నటిస్తావా అని అడిగిందట. పరిచయం లేని వ్యక్తి నుంచి వచ్చిన ఆ మాటకి షాక్ అయిన మోదక్..తన అమ్మా నాన్న ఇష్టం అని చెప్పిందట. అలా ఓ సీరియర్ కి సైన్ చేసిన దేబ్‌జానీ మోదక్..ఆ సీరియల్ షూటింగ్ మొదలయ్యాక ఆగిపోవడంతో నిరాశ చెందింది. ఆ తర్వాత ఆ సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్ తెరకెక్కించిన ఓ బెంగాలీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.
టెన్త్ లోనూ మొదటి సినిమా విడుదల కావడం ఆ తర్వాత మరో రెండు మూవీస్ చేయడంతో కాలేజీకి వెళ్లే అవకాశం రాలేదట. ప్లస్ టూ తర్వాత కరస్పాండెంట్ లో డిగ్రీ పూర్తిచేసింది. అయితే సినిమాల కన్నా ఇంట్లో తల్లిదండ్రులు సీరియల్స్ ని ఆస్వాదించడం చూసి సీరియల్స్ లో నటించాలనే ఆలోచన వచ్చి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది మోదక్. బెంగాలీలో ఏడు సీరియల్స్, తమిళంలో ఓ సీరియల్ చేసింది. ఇప్పుడు తెలుగులో 'ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్' లో అందం,అభినయంతో మెప్పిస్తోంది.
ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు పదేళ్లలో ఇబ్బంది పడిన సందర్భాలు లేవు, వెనక్కు వెళ్లాలనే ఆలోచనా లేదంటోంది మోదక్. అవకాశాలు వచ్చినన్ని రోజులూ నటన కొనసాగిస్తాంటోంది.
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ వేద ( దేబ్‌జాని మోదక్) (image credit:Debjani Modak/Instagram)