Divi Vadthya photos: సిల్వర్ స్క్రీన్ పై కన్నా సోషల్ మీడియాలోనే సందడెక్కువ - అయినా ఆ తిండేంటి దివి!
బిగ్ బాస్ షో ద్వారా ఫాలోయింగ్ సంపాదించుకున్న దివి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తూ...కొటేషన్స్, సాంగ్ లిరిక్స్, కవితలు యాడ్ చేస్తుంటుంది. ఈ సారి కొంచెం కొత్తగా...తింటున్న ఫొటోస్ చేసింది...ఏది ఎలా తినాలో అలానే తినాలంటూ కామెంట్ పెట్టింది...
తెలుగు బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన దివి..ఈ మధ్య వరుస ఆఫర్స్ అందుకుంటోంది..అయితే సోషల్ మీడియాలో అంతకుమించి బిజీగా ఉంటోంది. బాలీవుడ్ బ్యూటీస్ తో పోటీపడుతూ అందాల ప్రదర్శనలో రచ్చ చేస్తుంటుంది. హీరోయిన్ ఆఫర్స్ రాకపోయినా పెద్దగా పట్టించుకోకుండా వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటోంది..
సింగిల్ గా ఉన్నప్పుడు ఎలా ఉన్నా...అందరి మధ్యా ఉండేటప్పుడు మాత్రం చాలా స్టైలిష్ గా తింటారు. ముఖ్యంగా సెలబ్రెటీల లెక్కే వేరు. కానీ దివి మాత్రం చేతులు మొహానికి అంటించుకుంటూ మరీ తినేస్తోంది..
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)